సూపర్ స్టార్ మహేష్ లోని రకరకాల కోణాల గురించి బయటకు తెలిసింది తక్కువే. ఆయన ఆన్ లొకేషన్ ఎంతో జోవియల్ గా ఉంటారు. స్పాంటేనియస్ గానే పంచ్ లు వేస్తూ నవ్విస్తుంటారని కొలీగ్స్ చెబుతుంటారు. మహేష్ అంత సరదాగా ఉండే హీరోని చూడలేమని తనతో పని చేసిన దర్శకులు చెబుతారు. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో మహేష్ అంతే సరదాగా పేల్చిన ఓ పంచ్ ఒకటి ప్రత్యేకంగా ప్రస్థావనకు వచ్చింది.
గత కొద్ది రోజులుగా సూపర్ స్టార్ మహేష్ హాలీవుడ్ లో ఓ స్పై థ్రిల్లర్ లో నటించే ఛాన్సుందని ప్రచారమైంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు బిల్ డ్యూక్ చేసిన ఓ ఆసక్తికర కామెంట్ ఫ్యాన్స్ లో ఫీవర్ ని రాజేసింది. . ``మహేష్ - వంశీ పైడిపల్లి .. మీరు లాస్ ఏంజెల్స్‌కు వచ్చినప్పుడు డీటీఎల్ ఏ (డౌన్ టౌన్ లాస్ ఏంజెల్స్)లో దిగి నాతో భోజనానికి రండి. ఇంటర్నేషనల్ స్పై సినిమా గురించి చర్చించుకుందాం`` అని బిల్ డ్యూక్ ట్వీట్ చేయడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ దెబ్బకు మహేష్ నిజంగానే హాలీవుడ్ వెళ్లి జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ అడ్వెంచర్ లో నటించేయాలని కలలుగన్నారు. డేనియల్ క్రెయిగ్ ని జేమ్స్ బాండ్ సిరీస్ లో చూసి చూసి బోర్ ఫీలైన వాళ్లంతా మన మహేష్ నిజంగానే ఆ సిరీస్ హీరో అయితే బావుంటుందేమో అనుకున్నారు.
అయితే అందుకు మహేష్ రెడీయేనా? అంటే.. అస్సలు ఛాన్సే లేదని అతడి వాలకం చెప్పేసింది. ఎక్స్ మెన్ లాంటి ఫేమస్ ఫ్రాంఛైజీలో నటించిన హాలీవుడ్ స్టార్ బిల్ డ్యూక్ మహేష్ .. మురుగదాస్ లాంటి వాళ్లు లండన్ లో దిగితే తనతో లంచ్ కి రావాల్సింది గా కోరాడు. కలిసి ఓ ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ తీద్దామని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని మహర్షి ఇంటర్వ్యూలో ప్రస్థావిస్తే మహేష్ సైలెంట్ గా అదిరిపోయే పంచ్ వేశారు. ``ఆయన ఖాళీగా ఉన్నాడేమో.. అందుకే ట్వీట్లు చేస్తున్నాడ``ని చెప్పి సరదాగా నవ్వేసారు. మహేష్ మొదటి ప్రాధాన్యత తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత వీలుంటే ఇరుగు పొరుగుపై దృష్టి సారిస్తారు. తమిళం.. బాలీవుడ్ రెండు చోట్లా పాపులారిటీ తెచ్చుకోవాలన్న పంతం తనలో ఉంది. పనిలో పనిగా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ లో అన్ని మార్కెట్లను కలుపుకుంటూ ఇండియా లెవల్లో సినిమాలు చేయాలన్న ఆలోచనా ఉంది. అలా కాకుండా హాలీవుడ్ నటుడు పిలిచాడని హాలీవుడ్ కి వెళ్లిపోవాలంటే అందుకు చాలానే లెక్కలు అడ్డొస్తాయని చెప్పకనే చెప్పేసారన్నమాట!!