సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' మే 9 న రిలీజ్ అవుతోంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ మీడియాతో ముచ్చటించాడు. చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. 'మహర్షి' సినిమాను చేయడానికి కారణం ఏంటని అడిగితే ఈ సినిమా కథే తనకు నచ్చడమేనని తెలిపాడు. ఈ సినిమాలో మూడు షేడ్స్ ఉన్నాయి కదా.. మరి అందులో ఏ షేడ్ లో నటించడం కష్టం అనిపించింది అని అడిగితే స్టూడెంట్ గా నటించడానికి కాస్త ఆలోచించాల్సి వచ్చిందని తెలిపాడు.
హిందీ సూపర్ హిట్ '3 ఇడియట్స్' షేడ్స్ ఈ సినిమాలో ఉన్నాయా అని అడిగితే.. ఆ సినిమాకు 'మహర్షి' స్టూడెంట్ ఎపిసోడ్ కు సంబంధం లేదని చెప్పాడు. ఈ సినిమాలో మీరు చాలా అందంగా కనిపించారు అని అందరూ అంటున్నారు.. సీక్రెట్ ఏంటి అని అడిగితే.. సినిమాటోగ్రాఫర్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలని అన్నాడు. మూడు షేడ్స్ కు డిఫరెంట్ గా గెటప్స్ ఉండాలని అనుకున్నామని.. అదే ఫాలో అయ్యామని తెలిపాడు.
ఇక వంశీ రెండేళ్ళు వెయిట్ చేశాడని.. కొందరు రెండునెలలు కూడా వెయిట్ చెయ్యరని కామెంట్ చేశారు కదా? అని అడిగితే ఆ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. తన వ్యాఖ్యలు వంశీని పొగుడుతూ చెప్పినవని.. కానీ అందరూ సుకుమార్ ను విమర్శిస్తున్నట్టుగా రాశారని అన్నాడు. కానీ అలాంటిదేమీ లేదన్నాడు. "సుకుమార్ అంటే నాకు ఇష్టం. ఆయన నాకో మంచి స్నేహితుడు. గౌతమ్ ను సినిమాకు పరిచయం చేశాడు. '1 నేనొక్కడినే' లాంటి డిఫరెంట్ మూవీ అందించాడు" అన్నాడు. మరి క్రియేటివ్ డిఫరెన్సులు.. సినిమా క్యాన్సిల్ కావడం గురించి అడిగితే.. వరసగా మెసేజ్ ఉండే సినిమాలు చేస్తూ వస్తున్నానని.. అలాంటి సమయంలో అనిల్ రావిపూడి స్క్రిప్ట్ తనకు ఒక బ్రేక్ లాగా అనిపించిందని.. అందుకే అనిల్ సినిమా చేసిన తర్వాత చేద్దామని సుకుమార్ కు చెప్పానని తెలిపాడు. దాంతో సుకుమార్ కూడా "నేను మరో సినిమా చేసుకొని వస్తాను" అన్నాడు. అంతకు మించి ఇంకేమీ లేదన్నాడు. మరి మీ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అంటే... తప్పకుండా ఉంటుందని చెప్పాడు.
బౌండ్ స్క్రిప్ట్ విషయం గురించి మాట్లాడుతూ "స్పైడర్.. బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు ఇరవై నిముషాలు విన్నప్పుడు కథ చాలా బాగుందనిపిస్తుంది. కానీ అదే కథను ఫుల్ లెంగ్త్ సినిమాగా మార్చడంలో దెబ్బతింటోంది. అందుకే బౌండ్ స్క్రిప్ట్ ఉంటే తప్ప సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యాను" అన్నాడు.