దాంతో అలిసిపోయానన్న సూపర్ స్టార్!

Update: 2018-12-01 11:04 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటించడంతో పాటుగా పలు కార్పొరేట్ బ్రాండ్లకు అంబాజిడర్ గా పనిచేస్తాడన్న సంగతి తెలిసిందే.  పాపులర్ కూల్ డ్రింక్ బ్రాండ్ థమ్సప్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాజిడర్. సరిగ్గా ఒక వారం క్రితం మహేష్ కొత్త థమ్సప్ యాడ్ వచ్చింది.  సాధారణంగానే థమ్సప్ యాడ్స్ ఫుల్ యాక్షన్ తో ఉంటాయి. ఈ కొత్త యాడ్ 'అంతకు మించి' అన్నట్టుగా ఉండడంతో అందరికీ నచ్చేసింది.

ఫ్యాన్స్ అయితే మహేష్ బెస్ట్ యాడ్స్ లో ఇదొకటని అంటున్నారు.  సినిమాలలో ఉండే యాక్షన్ సీక్వెన్స్ రేంజ్లో  ఈ యాడ్ ఉండడం విశేషం.  సేమ్ యాడ్ ను హిందీలో రణవీర్ సింగ్ చేయగా తెలుగులో మహేష్ చేశాడు.  ఈ యాడ్ ను మలేషియా లోని కౌలా లంపూర్ దగ్గర ఉండే అడవుల్లో చిత్రీకరించారట.  ఈ యాడ్ గురించి రీసెంట్ గా మహేష్ మాట్లాడుతూ ఈ యాడ్ చిత్రీకరించిన అడవి చాలా దట్టమైనదని ఆ షూటింగ్ తో అలిసిపోయానని చెప్పాడు.  కానీ అవుట్ పుట్ చూసిన తర్వాత ఎనర్జీ వచ్చిందని చెప్పాడు.

గూండాలు గన్ లతో షూట్ చేస్తూ తరుముతూ ఉంటే.. థమ్సప్ బాటిల్ కోసం పరిగెత్తడం.. చెట్ల ఊడలు పట్టుకుని వేలాడడం.. జలపాతంలోకి దూకడం.. అసలు మామూలుగా లేదు ఈ యాడ్.. ఒకవేళ మీరు కనుక చూసి ఉండకపోతే ఒక లుక్కేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News