శేఖర్ కమ్ముల... యువరక్తానికి కిక్కిచ్చే దర్శకుడు. చిన్న హీరోలతోనే పెద్ద హిట్లిచ్చే ధీశాలి. అయితే శేఖర్ కమ్ముల ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తాడన్న ఆశ, తీయగలడా అన్న ప్రశ్న ఎప్పుడూ అందరికీ వుండేది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దానికి సమాధానమిచ్చాడు.
అనామిక ఫెయిల్యూర్ తరువాత చాలాకాలం గ్యాప్ తీసుకుని మనసుపెట్టి రాసిన స్క్రిప్ట్ ఫిదా అట. ప్రస్తుతం వరుణ్ తేజ్ - సాయి పల్లవిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ముందుగా మహేష్ బాబుని సంప్రదించాడట. మహేష్ కి స్క్రిప్ట్ నచ్చడంతో తన దగ్గరే వుంచుకున్నట్టు సమాచారం.
అయితే నెలల తరబడి స్క్రిప్ట్ పై ఫైనల్ డెసిషన్ తీసుకోకపోవడం, పక్కా క్లాస్ మూవీగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా నిరాశపరచడంతో ఇద్దరూ పునరాలోచనలో పడ్డారట. చివరికి ఆ స్క్రిప్ట్ వరుణ్ చేతిలో పడడంతో క్యూట్ లవ్ స్టోరీలో నటించే ఛాన్స్ కొట్టేశాడన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/