మహేష్ బాబు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఎప్పుడు మాట్లాడని పలు విషయాల గురించి మహేష్ బాబు మాట్లాడటంతో అంతా కూడా ఆసక్తిగా ఆ విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ ఇంటర్వ్యూలోనే మహేష్ బాబును మీ బయోపిక్ ను తీయాలంటే ఎవరు తీస్తే బాగుంటుంది.. ఎవరు మీ పాత్రలో చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంటూ ఇంటర్వ్యూవర్ ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు. నా జీవితం అనేది చాలా బోరింగ్ గా సాగింది.. సాగుతుంది. అందుకే నా జీవితం గురించి సినిమా తీస్తే బోర్ కొడుతుంది తప్ప ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేరు అన్నట్లుగా కామెంట్స్ చేశాడు. నా బయోపిక్ తీయాలనే ఆలోచనే వృదా అన్నట్లుగా మహేష్ బాబు మాట్లాడాడు. కాని మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఆయన వాదనతో విభేదిస్తున్నారు.
మహేష్ బాబు బాల నటుడిగా చేసినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో ఎన్నో అద్బుతాలను ఆవిష్కరించాడు. అవన్నీ కూడా అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే బయోపిక్ ను తీయాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికప్పుడు కాకున్నా గౌతమ్ పెద్ద వాడు అయిన తర్వాత అయినా మహేష్ బాబు పాత్రలో గౌతమ్ నటింపజేసి మహేష్ బయోపిక్ ను తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.