మహేష్ మాటలతో అభిమానులు ఏకీభవిస్తారా?

Update: 2015-08-15 12:19 GMT
హీరోలంతే మరి. తమ కొత్త సినిమా వచ్చినపుడల్లా.. ఇదే బెస్ట్ మూవీ అనేస్తుంటారు. మహేష్ బాబు కూడా అలాగే అనేశాడు. ‘శ్రీమంతుడు’ తన కెరీర్ లో బెస్ట్ మూవీ అని ఖరారు చేసేశాడు. ఐతే కంటెంట్ పరంగా, మహేష్ పెర్ఫామెన్స్ పరంగా చూస్తే ఈ మాట టూమచ్ గా ఏమీ లేదనే చెప్పాలి. శ్రీమంతుడు మహేష్ కెరీర్ లో ది బెస్ట్ అంటే అభిమానులకు ఇబ్బందిగా ఉంటుందేమో కానీ... వన్ ఆఫ్ ద బెస్ట్ అని మాత్రం ఒప్పుకుని తీరాల్సిందే.

మహేష్ కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ లిస్టు తీస్తే ముందు ‘అతడు’ నిలుస్తుందనడంలో సందేహం లేదు. పెర్ఫామెన్స్ పరంగా చూసినా, కంటెంట్ పరంగా చూసినా అతడు తర్వాతే ఏదైనా అనిపిస్తుంది. ఆ సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నాడు మహేష్. ఆ తర్వాత పోకిరి - దూకుడు - ఒక్కడు - మురారి సినిమాలు వరుసలో నిలుస్తాయి. ఈ సినిమాలన్నీ కూడా కమర్షియల్ గా అద్భుతమైన విజయం సాధించడమే కాదు.. వాటిలో మహేష్ పెర్ఫామెన్స్ కు కూడా తిరుగులేదనే చెప్పాలి. ఐతే ‘1 నేనొక్కడినే’ సక్సెస్ కాకపోయినా గొప్ప సినిమా, అందులో మహేష్ పెర్ఫామెన్స్ కూడా అద్భుతం అనడంలో సందేహం లేదు.

కాకపోతే ‘శ్రీమంతుడు’ సినిమా ఓ ఉదాత్తమైన కథాంశంతో తెరకెక్కింది కాబట్టి మహేష్ ఎగ్జైట్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. మహేష్ లాంటి సూపర్ స్టార్ ఇంత మంచి సినిమాలో నటించడం విశేషమే. ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చడం ఇంకా పెద్ద విశేషం. ప్రి క్లైమాక్స్ లో తండ్రితో మాట్లాడే సన్నివేశంలో మహేష్ నటన అతడి కెరీర్ లో ‘వన్ ఆఫ్ ద బెస్ట్’ అనిపించింది. ఐతే అభిమానుల కోణంలో చూస్తే మాత్రం ‘శ్రీమంతుడు’ ది బెస్ట్ అనిపిస్తుందా లేదా అన్నదే డౌటు.
Tags:    

Similar News