మహేష్ కూడా భలే మార్చేస్తున్నాడే..

Update: 2017-06-01 04:45 GMT
మహేష్ బాబు తన కొత్త సినిమాపై ఇప్పటికే దృష్టి పెట్టేశాడు. ఒకవైపు మురుగదాస్ మూవీ పనులను చివరికి తీసుకొచ్చిన టాలీవుడ్ సూపర్ స్టార్.. కొరటాల శివతో 'భరత్ అను నేను' ప్రాజెక్టును పట్టాలెక్కించేశాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ కోసం.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

మహేష్ కొత్త సినిమా కోసం ట్యాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ ను తీసుకువస్తున్నారు. బాలీవుడ్.. కోలీవుడ్ లలో భారీ సినిమాలకు పని చేసిన రవి కె. చంద్రన్ కు కెమేరా బాధ్యతలు అప్పగించనున్నాడు కొరటాల. రెండున్నర దశాబ్దాలకు అనుభవం ఉన్న రవి కె చంద్రన్ గతంలో బ్లాక్.. ఫనా.. రబ్ నే బనా దీ జోడీ.. మై నేమ్ ఈజ్ ఖాన్.. బార్ బార్ దేఖో వంటి హిందీ చిత్రాలతో పాటు.. తమిళ్ సెవెంత్ సెన్స్ చిత్రానికి వర్క్ చేశాడు. ఇప్పుడు భారీ బడ్జెట్ తో రూపొందనున్న మహేష్ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు ఈ సీనియర్ సినిమాటోగ్రాఫర్. రత్నవేలుతో బ్రహ్మోత్సవం.. సంతోష్ శివన్ తో స్పైడర్.. ఇప్పుడు రవి కె చంద్రన్ తో కొత్త సినిమా.. విజువల్స్ విషయంలో ఛేంజ్ చూపించేందుకు సినిమాటోగ్రాఫర్స్ ను మార్చుతున్న తీరు ఆకట్టుకుంటోంది.

అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో అడ్వాన్సెడ్ గా ఉంటాడు. ఇప్పటికే సరైనోడు చిత్రానికి రిషి పంజాబీ.. దువ్వాడ జగన్నాధం కు అయాంక బోస్ వంటి కాస్ట్లీ సినిమాటోగ్రాఫర్లను తీసుకొచ్చాడు. టాలీవుడ్ సినిమా కనిపించే తీరును మార్చేందుకు స్టార్ హీరోల ప్రయత్నాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News