సూపర్ స్టార్ మహేష్ బాబు 'పోకిరి' సినిమా ను ఆయన పుట్టిన రోజు సందర్బంగా రీ రిలీజ్ కు ప్లాన్ చేశారు. అభిమానులు ముఖ్య పట్టణాల్లో పోకిరితో మహేష్ బాబు పుట్టిన రోజు వేడుక జరుపుకునేందుకు సిద్ధం అయ్యారు. రీ రిలీజ్ విషయంలో మొదట కొన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 50 నుండి 70 స్క్రీన్స్ ల్లో పోకిరి సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.. ఆ స్క్రీన్ అయినా హౌస్ ఫుల్ అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని పరిస్థితి చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది.
పోకిరి సినిమాలో ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అంటాడు.. నిజంగానే పండుగాడి రీ రిలీజ్ కూడా మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. పోకిరి వస్తున్నాడు అంటే అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఒకింత ఆసక్తితో దగ్గరలో ఉన్న స్క్రీన్స్ ను వెదుక్కున్నారు. అలా రీ రిలీజ్ ఏకంగా 150 స్క్రీన్స్ లో డిసైడ్ అయ్యింది.
ఆ రోజు వచ్చేప్పటికి మరిన్ని స్క్రీన్స్ పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే కన్ఫర్మ్ అయిన అన్ని షో లకు కూడా హౌస్ ఫుల్. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో పలు చోట్ల కూడా రీ రిలీజ్ కాబోతున్న పోకిరి కి హౌస్ ఫుల్ కలెక్షన్స్ అప్పుడే నమోదు అయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత రాబోతున్న పోకిరి కి ఇదెక్కడి అరాచకం బాబోయ్ అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు కూడా ఆశ్చర్యపోతున్నారు.
2006 సంవత్సరంలో వచ్చిన పోకిరి సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వంద రోజుల రికార్డులు పోకిరి తోనే అంతం అన్నట్లుగా ఆ తర్వాత థియేటర్ రికార్డులు కనుమరుగు అయ్యాయి. పోకిరి సినిమా ఒక ఫక్త్ మాస్ కమర్షియల్ మూవీ. అద్భుతమైన మాస్ ఎలిమెంట్స్ తో పూరి సినిమాను తెరకెక్కించాడు.
తెలుగు సినిమా ఐటెం సాంగ్ అంటే ఇప్పటికి కూడా పోకిరి సాంగ్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాగే క్లైమాక్స్ మరియు ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు ఇప్పటికి కూడా సర్ ప్రైజింగ్ గా అనిపిస్తాయి. అందుకే పోకిరి కి ఇప్పటికి కూడా ఇంత డిమాండ్.