అతను ఎంత లావుండేవాడో అంటున్న మహేష్

Update: 2016-09-28 05:34 GMT
తన ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో నవీన్ విజయ్ కృష్ణకు బాగానే సపోర్ట్ ఇచ్చాడు మహేష్ బాబు. అతను హీరోగా పరిచయమవుతున్న ‘నందిని నర్సింగ్ హోం’ ఆడియో వేడుకకు మహేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నవీన్ గురించి చాలా బాగా మాట్లాడటమే కాక.. అతడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు మహేష్. అతనేమన్నాడంటే..

‘‘నరేష్ గారు ఈ రోజు చాలా ప్రౌడ్ గా కనిపిస్తున్నారు. నవీన్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. ఐతే బాగా పరిచయం అంటే అతడు.. పోకిరి సినిమాలు చేస్తున్నపుడే. అప్పట్లో నవీన్ ఎక్స్ట్రార్డినరీ ఎడిటర్. పాటలు కానీ.. ఫైట్లు కానీ ఏవైనా కొత్తగా కావాలనుకుంటే అతడి దగ్గరికే వెళ్లేవాళ్లం. అతను నా సినిమాలకు పని చేశాడు. సినిమాకు సంబంధించి ఎడిటింగ్ అనేది చాలా కష్టమైన జాబ్. చిన్న వయసులోనే నవీన్ అది చేశాడు.

మరి పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావ్ అని ఓసారి నవీన్ ను అడిగాను. యాక్టర్ అవుదామనుకుంటున్నా అన్నా అన్నాడు. ఐతే అతను జోక్ చేస్తున్నాడా.. సీరియస్ గా అంటున్నాడా అని తెలియదు. అప్పటికి అతను చాలా లావుగా ఉండేవాడు. కానీ ఒక ఏడాది తర్వాత కలిసినపుడు చూస్తే సన్నబడటమే కాదు.. సిక్స్ ప్యాక్ చేశాడు. హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా సక్సెస్ సాధిస్తారు అని నేను నమ్ముతాను నవీన్ కష్టపడ్డాడు కాబట్టి ఫలితం ఉంటుంది. ‘నందిని నర్సింగ్ హోం’ పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అని మహేష్ ముగించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News