తమ అభిమాన హీరోను ఒక్కసారైనా నేరుగా కలవాలని ఫోటో దిగాలని అభిమానులకు కోరిక ఉండటం సహజం. ఇది అందరికి వర్తిస్తుంది. కాకపొతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి అభిమానిని సంతృప్తి పరచడం హీరోలకు తలకు మించిన పనిగా మారుతోంది. స్వతహాగా రిజర్వ్ గా ఉండే మహేష్ తన ఫాన్స్ తో మరీ ఎక్కువ కలివిడిగా ఉండటం - కలిసిపోవడం తక్కువగా చూస్తూ ఉంటాం. కాని భరత్ అనే నేను నుంచి కొంత ఫాన్స్ కోసం సమయం కేటాయించాలనుకున్నాడు మహేష్. అనుకోవడం ఆలస్యం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఉన్న భరత్ అనే నేను సాంగ్ షూట్ జరుగుతున్న అల్యూమినియం ఫ్యాక్టరీ సెట్ వద్దకు రమ్మని తన పిఆర్ఓ ద్వారా సందేశం పంపించారు. షూటింగ్ గ్యాప్ లో వాళ్ళతో ఫోటో తీసుకుని ముచ్చట తీర్చాలని ఈ ప్లాన్. దానికో సిస్టం కూడా పెట్టారు.
ఒక్కో జిల్లా నుంచి వచ్చే అభిమానుల సమూహానికి ఐడి కార్డులు ఇచ్చి ఒకేసారి మహేష్ తో ఫోటో తీసుకునే అవకాశం కల్పించింది పిఆర్ టీం. మొదట పదుల్లో స్టార్ట్ అయిన సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ అందరికి న్యూస్ వైరల్ కావడంతో వందల్లో తండోపతండాలుగా రావడం మొదలు పెట్టారు. మొదట ఇదంతా లైట్ గానే తీసుకున్న మహేష్ బాబు రాను రాను ఈ తతంగం పెద్ద జాతరను తలపించే విధంగా తయారవడంతో కాస్త అసహనానికి లోనైనట్టు ఇన్ సైడ్ టాక్. అది సహజమే. ఒకవైపు విడుదలకు నెల రోజుల సమయం కూడా లేదు. ఇంకా చాలా పనులు బాలన్స్ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అభిమానుల తాకిడిని తట్టుకోవడం అంటే మాటలు కాదు.
ఓ స్థాయి వరకు ఇది భరించిన మహేష్ ఇక ఆగలేక తన టీంను కొద్ది రోజులు ఈ ఫోటో షూట్ కు బ్రేక్ ఇమ్మని చెప్పాడట. అయినా ఇష్టమైన హీరోతో ఫోటో తీసుకునే ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. అందులోనూ ప్రిన్సాయే. ఊరికే ఉంటారా. పబ్లిక్ ప్లేస్ లో అనుమతించినప్పుడు ఇలాంటి ఇబ్బందులు సహజంగానే ఉంటాయి. అందులోనూ ప్రత్యేకంగా మహేష్ ను కలవొచ్చు అని చెప్పడమే ఇంత రచ్చకు కారణమైంది.