మహేష్ కి అమెరికా అమ్మాయి లెటర్

Update: 2018-02-03 17:12 GMT
మహేష్ బాబు కి బోలెడంత ఫాలోయింగ్ ఉంటుందనే సంగతి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు కుర్రకారు నుంచి అటు ఫ్యామిలీస్ వరకు.. చిన్న పిల్లల నుంచి ఓల్డేజ్ వరకు.. పక్కా పల్లెటూళ్ల నుంచి ఫారిన్ కంట్రీస్ వరకు.. అందరూ విపరీతంగా అభిమానించే హీరో సూపర్ స్టార్.

తమ అభిమాన హీరోలకు ఫ్యాన్స్ సందేశాలు పంపడం సహజమే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయి.. అంతా ఈమెయిల్స్ బాట పట్టేశారు. కానీ మహేష్ కు అమెరికా నుంచి ఓ లెటర్ వచ్చింది. అది కూడా ఓ చిన్నారి పాప ఈ లెటర్ రాయడం విశేషం. డియర్ మిస్టర్ ఘట్టమనేని అంటూ మొదలు పెట్టి.. తాను ఎక్కడ చదువుతోందో చెప్పిన నేహ అనే చిన్నారి.. ఎవరైనా సెలబ్రిటీకి లెటర్ రాయాలని వాళ్ల స్కూల్ లో చెప్పడంతో.. మహేష్ బాబుకు లేఖర రాయాలని ఫిక్స్ అయిందట. తన ఫేవరెట్ మూవీ శ్రీమంతుడు అంటోంది ఈ అమెరికా పాప. ఈ లెటర్ చదువుతున్నందుకు మహేష్ కి థ్యాంక్స్ కూడా చెప్పేసింది.

అమెరికా చిన్నారి రాసిన లేఖను.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన మహేష్ బాబు. ఆ లెటర్ చదువుతూ చాలా సంతోషించానని చెప్పిన సూపర్ స్టార్.. బాగా చదువుకోవాలని కోరుకున్నాడు. తన సినిమాలు చూస్తున్నందుకు హ్యపీగా ఉందన్న మహేష్.. తన పిల్లలు సితార - గౌతమ్ లకు కూడా శ్రీమంతుడు సినిమా అంటే బాగా ఇష్టం అని చెప్పాడు.


Tags:    

Similar News