'భరత్ అను నేను' వచ్చేసాను

Update: 2018-01-07 07:33 GMT
జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ ఉన్న హీరోల్లో మహేష్ బాబుది ప్రత్యేక స్థానం. అందుకే ఎంత పెద్ద డిజాస్టర్ వచ్చినా కొత్త సినిమాకి అంతకు రెట్టింపు క్రేజ్ వస్తుంది. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఇచ్చిన షాక్ చిన్నది కాకపోయినా దాన్నుంచి వెంటనే కోలుకున్న మహేష్ ఎక్కువ ఆలస్యం చేయకుండా భరత్ అను నేను షూటింగ్ మొదలు పెట్టేసాడు. శ్రీమంతుడుతో తనకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మరోసారి చేతులు కలిపాడు. మొన్నటిదాకా దీనికి బ్రేక్ ఇచ్చి హాలిడే వెకేషన్ కోసం విదేశీ పర్యటనలో మహేష్ బాబు ఫ్యామిలీతో సహా నిన్న రాత్రి తిరిగి వచ్చేసాడు. అతి త్వరలో భరత్ అను నేను షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

సమ్మర్ విడుదల ప్లాన్ చేసిన భరత్ అను నేను రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నా పేరు సూర్య ఏప్రిల్ 27న విడుదల చేస్తామని ఆ సినిమా నిర్మాత ఇటీవలే మరోసారి ప్రకటించిన నేపధ్యంలో భరత్ అను నేను గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మొదటిసారి సిఎంగా నటిస్తున్న మహేష్ బాబు పాత్ర ఒకే ఒక్కడులో అర్జున్ తరహాలో చాలా పవర్ ఫుల్ గా ఉంటూనే మాస్ కి కావలసిన అంశాలన్నీ ఇందులో ఉండేలా కొరటాల శివ కేర్ తీసుకున్నట్టు టాక్. కృష్ణ గారు గతంలో ముఖ్యమంత్రి అనే పేరుగల సినిమాలో నటించారు. విజయ నిర్మల దానికి దర్శకురాలు. ఇప్పుడు మహేష్ కూడా సిఎం రోల్ చేయటం పట్ల దాన్ని గుర్తుచేసుకుంటున్నారు ప్రిన్స్ ఫాన్స్. దేవిశ్రీ ప్రసాద్ మరో మ్యూజికల్ హిట్ ఇస్తాడనే అంచనాలు బలంగా ఉన్నాయి
Tags:    

Similar News