బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలు రిలీజ్ లకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటిలో ప్రమోషన్స్ పరంగా దూసుకుపోతున్నవి ఏవి.. రేసులో వెనకబడినవి ఏవి అన్నది ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. చిరు-చరణ్ నటించిన భారీ చిత్రం ఆచార్య వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 29న) విడుదలవుతుండగా.. మహేష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సర్కారువారి పాట మే 12న సినిమాల్లోకి రాబోతోంది. దిల్ రాజు ఎఫ్ 3 మే 27న విడుదల కానుంది.
అయితే ఈ సినిమాలన్నీ ప్రచారం పరంగా దూకుడును ప్రదర్శిస్తుండగా ఇతరులతో పోలిస్తే రేసులో మహేష్ చాలా వెనకబడి ఉన్నాడని సర్కార్ వారి దూకుడు కనిపించడం లేదని గుసగుస వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో మహేష్ కంటే థమన్ ఇన్ స్టా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండి ప్రమోట్ చేస్తున్నాడు మినహా సర్కార్ వారి ప్రమోషన్ గురించి చెప్పుకోదగ్గది ఏదీ లేదు. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు దృష్టిని ఆకర్షించినా ఈ ప్రమోషన్ సరిపోదన్న విశ్లేషణ సాగుతోంది.
ఇటీవల స్టార్ హీరోలంతా బోలెడంత ప్రచారం చేస్తూ సందడిని పెంచారు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా బాక్సాఫీస్ లక్ష్యంగా బరిలో దిగిపోతున్నారు. దానికి తగ్గ ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ రెండిటిపైనా మహేష్ కి ఏమంత ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనర్లను పొందడానికి దాదాపు పాతిక రోజుల పాటు నిర్విరామంగా సినిమాను ప్రమోట్ చేయాలి. కానీ మహేష్ అండ్ టీమ్ అలా చేయకపోవడం ఆశ్చర్యపరుస్తోందని అంటున్నారు. కనీసం ఆర్.ఆర్.ర్ - కేజీఎఫ్ టీమ్ లు చేసిన ప్రమోషన్ చూశాక అయినా మహేష్ అండ్ టీమ్ మారలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్.
తెలుగు రాష్ట్రాల్లో మహేష్ ప్రమోషన్ చేసినా చేయకున్నా అతడి హవాకి ఎదురు లేదు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టాలంటే దానికి తగ్గ ప్రణాళిక అతడికి అవసరం. ఇక ఈ మూవీ రకరకాల కారణాలతో రిలీజ్ పరంగా వాయిదా పడొచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. దానిని నిజం చేస్తూనే ఇలా సర్కార్ వారి టీమ్ సైలెంటుగా ఉందా? అన్నది వేచి చూడాలి.
గాయకుడు అలా అన్నారేమిటీ..!
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఒక సినిమా తర్వాత ఒకటి చేస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తున్నా ప్రచారంలో ఇంకా స్లో అనేదే ఇప్పుడు చర్చగా మారింది. ఇతర హీరోలతో పోలిస్తే మహేష్ మరీ అంతగా హైరానా పడడం లేదు. ఒకేసారి మూడు నాలుగు సెట్స్ కి పరుగులు పెట్టడం లేదు. షెడ్యూళ్ల పరంగా సూపర్ కృష్ణకు పూర్తి ఆపోజిట్ గా ఉన్నారని చెప్పాలి. ఇక తన వెంట షాడో నమ్రత మాత్రం స్క్రిప్టులు వింటూ తన పని తాను చేసుకుపోతున్నారు. తదుపరి దర్శకధీరుడు రాజమౌళితో పాన్ ఇండియా సినిమా కోసం మహేష్ సన్నాహకాల్లో ఉన్నారు. ఈలోగానే అతడు నటించిన తాజా చిత్రం `సర్కారు వారి పాట` 12 మే 2022న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సర్కార్ వారి ప్రమోషన్స్ లో భాగంగా రెండు హిట్ పాటలను విడుదల చేసిన మేకర్స్ మరో క్రేజీ ట్రాక్ ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి బుట్ట బొమ్మా గాయకుడు ట్వీట్ చేసారు. ``నాకు సందేశం పంపే SSMB అభిమానులందరికీ సర్కారు వారి పాటలోని పాట ఎప్పుడు రిలీజవుతుందో నాకు నిజంగా క్లూ లేదు. మీరందరూ వినడానికి ఎంత ఆత్రుతగా ఉన్నారో నాకు తెలుసు. నన్ను నమ్మండి.. నేను కూడా! కానీ ప్రతిదానికీ అంతర్గత ప్రణాళిక అనేది ఉంటుంది.
అధికారిక ప్రకటన కోసం ఓపికగా వేచి ఉండటమే మనం చేయగలిగింది`` అని అన్నారు. ఎస్.ఎస్.థమన్ కంపోజ్ చేసిన ఈ డ్యూయెట్ ను త్వరలో విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్- 14 రీల్స్ ప్లస్-GMB ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయిక. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో ఆద్యంతం కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఎట్టి పరిస్థితుల్లో హిట్టు కొట్టాలన్న కసితో మహేష్ - పరశురామ్ బృందం ఈ మూవీ కోసం సీరియస్ గా వర్క్ చేశారన్నది తెలిసిందే. మరో మూడు వారాల్లో సినిమా థియేటర్లలోకి రానుండడంతో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది.