అన్న‌య్య నిస్వార్థంగా నాకు ఇచ్చిన‌ది ఇదే!-మ‌హేష్‌

Update: 2020-10-13 17:30 GMT
సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సుడు అన‌గానే మ‌హేష్ గుర్తుకొస్తారు. అయితే మ‌హేష్ కంటే ముందే హీరో అయ్యారు ర‌మేష్ బాబు. కానీ అత‌డు ప‌రిమితంగానే సినిమాలు చేసి ఈ రంగం నుంచి ఎగ్జిట్ అయ్యారు. కొన్ని సినిమాల‌కు నిర్మాత‌గా కొన‌సాగారు. 1987 సంవత్సరంలో హీరోగా అరంగేట్రం చేసిన ర‌మేష్ బాబు 1997 వ‌ర‌కు ద‌శాబ్ధం పాటు ఇండ‌స్ట్రీలో కొన‌సాగారు. ఆ తర్వాత కృష్ణ వార‌స‌త్వ లెగ‌సీని మహేష్ బాబు స్వీకరించారు.

మంగళవారం రమేష్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్ంగా.. మహేష్ తన సోదరుడికి శుభాకాంక్ష‌లు తెలిపారు. నాటి క్లాసిక్ మూవీలో అన్న‌య్య ర‌మేష్ తో క‌లిసి న‌టిస్తున్న‌ప్ప‌టి స్టిల్ ఒక‌టి షేర్ చేశారు. “ఇక్కడ నా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా అభ్యాసంలో కొంత భాగం అతని నుండి వచ్చిందని సులభంగా చెప్పగలను… క్రమశిక్షణ.. అంకితభావం .. అభిరుచి అతను నిస్వార్థంగా నాకు ఇచ్చాడు. మీకు గొప్ప ఆరోగ్యం.. చాలా ఆనందం ద‌క్కాల‌ని కోరుకుంటున్నాను” అని మహేష్ ట్వీట్ చేశారు.

బాల న‌టుడిగా మ‌హేష్ రమేష్ హీరోగా న‌టించిన చిత్రంలో క‌నిపించారు. ఇటీవ‌లే సోద‌రి ప్రియ‌ద‌ర్శిని బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం క‌లిసి లంచ్ చేశారు. ఇంత‌లోనే మహేష్ తన సోదరుడు రమేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పడం ఆస‌క్తిక‌రం. ఇలా ఇదే మొదటిసారి .. ఇది ఒక మధుర జ్ఞాప‌క‌మే మ‌రి.
Tags:    

Similar News