మరోసారి మానవత్వం చాటుకున్న సూపర్ స్టార్!

Update: 2020-06-24 13:00 GMT
టాలీవుడ్ హీరో మహేష్ బాబు మరోసారి తన సహృదయాన్ని చాటుకొని సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్ హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నెల రోజుల శిశువుకు అరుదైన గుండె శస్త్రచికిత్సను ఉచితంగా చేయించాడు. తూర్పుగోదావరి జిల్లా ఆళ్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నాగజ్యోతి, ప్రదీప్‌ దంపతుల శిశువుకు అరుదైన గుండె జబ్బు ఉంది. ఆక్సిజన్‌తో కూడిన మంచి రక్తం గుండెలోని చెడు రక్తంతో కలిసి పోతోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ నటుడు మహేశ్‌బాబు పాపకు వైద్య చికిత్సలు చేయాలని ఆంధ్రా ఆసుపత్రి వైద్యులను కోరాడట. పాపను ఆసుపత్రికి తీసుకురాగానే ఈ నెల 2న ఉచితంగా శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఆ తర్వాత పాప రక్తపోటు తగ్గటం.. గుండె కొట్టుకోవడంలో మార్పుతో పాటు, ఇన్‌ఫెక్షన్లు వచ్చాయి.

ఈ సమస్యలన్నింటినీ దాటుకొని రెండు వారాల తర్వాత ఇంటెన్సివ్‌ కేర్‌ నుంచి శిశువు బయటకు వచ్చింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం డిశ్ఛార్జి చేశారు. అలా సూపర్ స్టార్ మళ్లీ తన సేవాదృక్పథాన్ని చాటుకున్నాడు. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు హీరోగా త్వరలో తెరకెక్కనున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇప్పటికే ఈ మూవీకి చెందిన టైటిల్ పోస్టర్ చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆ పోస్టర్ లో మహేష్ లుక్.. టాటూ.. హెయిర్ స్టైల్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మహేష్ అభిమానులు కోరుకునే విధంగా ఈ మూవీ స్క్రిప్ట్ పరశురామ్ రెడీ చేసాడని టాక్. ఈ మూవీలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించనుంది. ఇక ఈ సినిమా పై మహేష్ అభిమానులలో భారీ అంచనాలే ఏర్పడ్డాయని చెప్పవచ్చు.
Tags:    

Similar News