నటశేఖర కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఒక పక్క పేరు నిలబెడుతుండగా మరో పక్క కూతురు మంజుల కూడా టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్క్ ఏర్పరుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రెండే పాత్రలున్న షో సినిమాతోనే తన టాలెంట్ చూపించిన మంజుల ఆ తర్వాత రెగ్యులర్ గ్యాప్స్ తో కొన్ని సినిమాలు చేసారు కాని అవేవి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి భర్త సంజయ్ తో కలిసి రామ్ చరణ్ ఆరంజ్ లో నటించారు కాని అది డిజాస్టర్ కావడంతో మళ్ళి గట్టి ప్రయత్నాలు చేయలేదు. ఇన్నాళ్ళ తర్వాత మొదటిసారి మెగా ఫోన్ చేపట్టి మనసుకు నచ్చింది సినిమాకు దర్శకత్వం వహించిన మంజుల రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో తమ్ముడు మహేష్ బాబు అంతరంగాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసారు మంజుల. సినిమాల్లో కనిపించేలా మహేష్ నిజ జీవితంలో అంత ఓపెన్ గా ఉండడని, కుటుంబం మీద అభిమానం,ప్రేమ ఎక్స్ ప్రెస్ చేయటం రాకే గుండెల్లోనే దాచుకుంటాడని చెప్పారు. సైలెంట్ గా ఉండటం మహేష్ నైజం అన్న మంజుల తన పుట్టిన రోజు నాడు కూడా మహేష్ ఫోన్ చేసి విష్ చేయడని, తాను ఏం చేయబోతున్నాను, ఆ రోజుకి ప్లాన్స్ ఏంటి అనేది సవివరంగా కనుక్కుని విష్ చేయటం మాత్రం మర్చిపోతాడట. ఇదే మాట అమ్మ కూడా చెబుతూ వాడికి ప్రేమించడం తెలుసు, ప్రేమించినవాళ్ళను గుండెల్లో పెట్టుకోవడమూ తెలుసు తప్ప అది బయటికి ఒకే విధంగా చూపించాలని ఎప్పుడూ అనుకోడని చెప్పారట.
మంజుల మాటలతో మహేష్ ప్రవర్తన మ్యాచ్ చేసి చూసుకుంటే నిజమే అనిపిస్తుంది. తండ్రి నట వారసత్వాన్ని మహేష్ కొనసాగిస్తే, ఆయన దర్శకత్వ మకుటాన్ని మంజుల మోసే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. నిర్మాతగా రమేష్ బాబు సైతం గతంలోనే అర్జున్ సినిమాతో పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నారు. మనసుకు నచ్చింది డిసెంబర్ 16న విడుదల కానుంది.