తనయుడితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న యువరాజు..!

Update: 2020-05-03 10:10 GMT
కరోనా కారణంగా సామాన్య ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో తాము ఏమి చేస్తున్నారో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్ లతో కుటుంబానికి దూరంగా ఉండే టాప్ స్టార్స్‌ ఇప్పుడు షూటింగ్ లకు బ్రేక్ పడటంతో ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని తమ కుటుంబం తో కలిసి సరదా గడిపేందుకు వినియోగించుకుంటున్నారు. ఇక ఎప్పుడూ ఖాళీ దొరికినా ఫ్యామిలీతో సమయం గడిపేందుకు ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్ బాబు ఇంట్లోనే ఉండి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. బేసికల్‌గా మహేష్ బాబుకు తన కుటుంబంతో గడపడమంటే మహా సరదా. ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్ షెడ్యూల్స్‌లో కూడా ఏ మాత్రం బ్రేక్ వచ్చినా భార్యాపిల్లతో టూర్స్ వేస్తూ ప్రపంచాన్ని చుట్టి వస్తుంటారు. ఈ క్వారంటైన్ సమయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. భార్యా పిల్లలతో ఇంట్లోనే ఉంటూ సరదాగా గడుపుతున్నారు. డైలీ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు.

ఈ రోజు వరల్డ్ లాఫర్ డే సందర్భంగా మరో పోస్ట్ తో ముందుకు వచ్చాడు మహేష్. ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారంను ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట‌ జనవరి రెండో ఆదివారం నాడు జరుపుకునే వారు. జనవరిలో చలి ఎక్కువగా ఉంటుందన్న హాస్య ప్రియులు కోరిక మేర లాఫ్టర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ దీన్ని మే మొదటి ఆదివారం జ‌రుపుతూ వ‌చ్చింది. ఈ రోజు ప్ర‌పంచ న‌వ్వుల దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ముఖులు కూడా సంతోషంగా న‌వ్వుతూ ఉన్న ఫోటోల‌ని షేర్ చేస్తున్నారు. తాజాగా మ‌హేష్ బాబు కూడా త‌న త‌న‌యుడు గౌతమ్‌తో క‌లిసి న‌వ్వుతున్న ఫోటో ఒక‌టి షేర్ చేశాడు. 'ప్ర‌తి క్ష‌ణం.. ప్ర‌తి రోజు.. న‌వ్వుతూ హ్యాపీగా ఉండాల‌ని' కామెంట్ పెట్టాడు. ఇంట్లోనే ఉంటూ సేఫ్ గా ఉండమని సూచించాడు. ఈ ఫోటో చూసిన సూపర్ స్టార్ అభిమానులు దరహాసాలు చిందిస్తున్న తండ్రీకొడుకులని చూసి సంతోషపడుతున్నారు. మీరు అలాగే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మీద ఈ లాక్ డౌన్ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పవచ్చు. సితార పాపతో కలిసి ఆడుకుంటున్నాడు.. గౌతమ్‌ తో ఆన్‌ లైన్ టెన్నిస్ గేమ్స్ కూడా ఆడుతున్నాడు. ఇప్పుడు మహేష్ పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Tags:    

Similar News