మూడున్నర కోట్లు పెడితే మంచి క్వాలిటీతో రెండు చిన్న సినిమాలు తీసేయొచ్చు. అలాంటి కేవలం ఒక్క పాటకే మూడున్నర కోట్లు పెట్టిందట పీవీపీ సంస్థ. ఆ సినిమా మరేదో కాదు.. బ్రహ్మోత్సవం. ఇందులో ఓ బ్రహ్మాండమైన పాట కోసం అక్షరాలా మూడున్నర కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ మధ్యే రామోజీ ఫిలిం సిటీలో ఆ పాటను పది రోజుల పాటు చిత్రీకరించారు. ఐతే ఖర్చుకు తగ్గట్లే ఆ పాట ఔట్ పుట్ కూడా అదిరిపోయిందట. తెలుగు సినిమాల్లో ఎప్పటికీ చెప్పుకునే విజువల్ గ్రాండియర్ తో ఆ పాట తెరకెక్కిందట.
బ్రహ్మోత్సవం షూటింగ్ మొదలు పెట్టడమే ఈ పాటతోనే మొదలుపెట్టారు. ఈ పాట షూటింగ్ జరుగుతుండగానే షారుఖ్ ఖాన్ వచ్చి మహేష్ బాబును కలిశాడు. కింగ్ ఖాన్ సైతం ఆ పాట కోసం వేసిన సెట్టింగులు, ఆ హంగామా చూసి ఆశ్చర్యపోయాడట. 500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులకు తోడు.. యూనిట్ సభ్యులు, నటీనటులతో కలిపి ఆ పాట షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు రామోజీ ఫిలిం సిటీలో సందడే సందడట. శ్రీకాంత్ అడ్డాల పక్కా ప్లానింగ్ తో ఈ పాట కోసం రెడీగా ఉండి.. తన ఆలోచనలకు తగ్గట్లే ఈ పాటను పూర్తి చేసినట్లు తెలిసింది.