‘స్పైడర్’ బిజినెస్ షాకింగ్ అంటే షాకింగే..

Update: 2017-09-07 13:03 GMT
మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’ గురించి కొందరు ప్రతికూల వార్తల్ని ప్రచారం చేస్తున్నప్పటికీ ఆ సినిమాపై జనాల్లో.. ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి ఎంతమాత్రం తగ్గట్లేదని.. బిజినెస్ గణాంకాల్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. మహేష్ బాబు గత సినిమా ‘బ్రహ్మోత్సవం’ అంత పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ.. ఆ ప్రభావం కూడా ఎంతమాత్రం ‘స్పైడర్’పై పడలేదు. తెలుగు.. తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం రెండు భాషల్లో కలిపి ఏకంగా రూ.156 కోట్ల బిజినెస్ చేయడం.. సౌత్ ఇండియన్ ట్రేడ్ వర్గాలనే కాదు.. బాలీవుడ్ వాళ్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటిదాకా రజినీకాంత్ సినిమాలకు.. ‘బాహుబలి’ లాంటి ప్రత్యేకమైన సినిమాలకు తప్పితే దక్షిణాదిన మరే సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ అయింది లేదు. ఏరియాల వారీగా ‘స్పైడర్’ బ్రేకప్స్ చూస్తే కళ్లు చెదిరిపోతున్నాయి. ప్రతి ఏరియాలోనూ రికార్డు స్థాయిలో రేటు పలికింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్’తో సమానంగా ‘స్పైడర్’ బిజినెస్ చేయడం విశేషం.

‘స్పైడర్’ వరల్డ్ వైడ్ బిజినెస్ వివరాలు..

నైజాం- రూ.23 కోట్లు

సీడెడ్- రూ.12 కోట్లు

వైజాగ్-8.1 కోట్లు

తూర్పు గోదావరి-రూ.6 కోట్లు

పశ్చిమ గోదావరి- రూ.5.04 కోట్లు

గుంటూరు- రూ.7.2 కోట్లు

కృష్ణా- రూ.5.4 కోట్లు

నెల్లూరు- రూ.2.9 కోట్లు

ఏపీ-తెలంగాణ మొత్తం- రూ.70 కోట్లు

కర్ణాటక- రూ.10.8 కోట్లు

తమిళనాడు- రూ. 17 కోట్లు

ఓవర్సీస్- రూ.23 కోట్లు

ఇతర ఏరియాలు- రూ.1 కోటి

వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్- రూ.121 కోట్లు

శాటిలైట్-డిజిటల్ రైట్స్- రూ.21 కోట్లు

ఆడియో హక్కులు- రూ.2 కోట్లు

మొత్తం- రూ.156 కోట్లు
Tags:    

Similar News