దసరా సినిమాలకు వరుసగా ఆడియో ఫంక్షన్స్ రద్దయిపోతున్నాయి. ఈ పండుగకు మొదటగా ఎన్టీఆర్ మూవీ జై లవకుశ రిలీజ్ కానుండగా.. సెప్టెంబర్ 3న జరగాల్సిన ఆడియో ఫంక్షన్ ను రద్దు చేసి.. అభిమానుల కోసం సెప్టెంబర్ 10న గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేసినట్లు.. రీసెంట్ గా నిర్మాత కళ్యాణ్ రామ్ ప్రకటించాడు.
ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇదే దారి పట్టనున్నట్లు తెలుస్తోంది. నిజానికి స్పైడర్ తెలుగు తమిళ్ వెర్షన్స్ కోసం.. హైద్రాబాద్.. చెన్నైలలో రెండు గ్రాండ్ ఈవెంట్స్ జరపాలని మొదట అనుకున్నారు. కానీ ఈ మధ్య టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. ఆడియో ఫంక్షన్ కు బదులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కల్చర్ మొదలైంది. అందుకే తెలుగు వెర్షన్ కోసం ట్రెండ్ ను ఫాలో అయిపోవాలని డిసైడ్ అయ్యారట. తమిళ్ వెర్షన్ కోసం మాత్రం ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గానే సెలబ్రేట్ చేయనున్నారని.. సెప్టెంబర్ 9న ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. అయితే.. అదే రోజు తెలుగు ఆడియోను కూడా రిలీజ్ చేసేసినా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మాత్రం ఈ నెల 16న కానీ.. 17నకానీ హైద్రాబాద్ లోని శిల్ప కళా వేదికలో నిర్వహించనున్నారని తెలుస్తోంది.
స్పైడర్ మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుండగా.. ఆడియో రిలీజ్ డేట్ నుంచి ప్రమోషన్స్ తో తెగ ఊదరగొట్టేయనున్నారట. ఆడియో ఫంక్షన్.. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి కూడా టాలీవుడ్.. కోలీవుడ్ ల నుంచి టాప్ మోస్ట్ డైరెక్టర్లను తీసుకొస్తున్నారని తెలుస్తోంది. 150 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందనే అంచనాలు ఉండడంతో.. ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టుకునేందుకు మేకర్స్ పక్కా ప్లానింగ్ తోనే ఉన్నారని టాక్.