ప్రిన్స్ మహేష్ ..రియాలిటీలో పక్కా శ్రీమంతుడు. ప్రేక్షకాదరణలో, పారితోషికంలో శ్రీమంతుడు. బ్రాండ్ ప్రమోషన్ లోనూ శ్రీమంతుడే. బాలీవుడ్ హీరోలకు ధీటైన ఛరిష్మాతో ప్రపంచాన్ని తన గుప్పిట్లో బంధించే సత్తా ఉన్న హీరో అతడు. అందుకే తొలి నుంచి అతడికి ఓ వైపు సినిమాలో, మరో వైపు బ్రాండ్ ప్రమోషన్ యాక్టివిటీస్.. రెండిటిలో ఒకటే జోరు కొనసాగిస్తున్నాడు.
ఇప్పటికే మహేష్ ఖాతాలో జాతీయ - అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ లు ఉన్నాయి. థమ్సప్ - ప్యారగాన్ లాంటి కంపెనీలకు ప్రమోటర్ గా కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. తాజాగా అతడి ఖాతాలోకి మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రమోట్ చేస్తున్న ఓ నేషనల్ రేంజు బ్రాండ్ ఒకటి వచ్చింది. ప్రిన్స్ ఈ యాడ్ ని టేకోవర్ చేసేశాడని సమాచారం.
దేశంలో అసహనం పెరిగిపోతోంది అంటూ ఇటీవలే కామెంట్ చేసిన అమీర్ .. తనలోని అసహనాన్ని బైటి ప్రపంచానికి చెప్పేయడంతో కొంప కూలినంత పనైంది. అతడి నుంచి ఒక్కో బ్రాండ్ దూరమైపోయే పరిస్థితి తలెత్తింది. అలా ఓ కంపెనీ కాంట్రాక్టును అమీర్ తోనే పునరుద్ధరించుకోకుండా మహేష్ కి ఆ ఛాన్సిచ్చింది. మహేష్ తర్వాత బ్రాండ్ ప్రమోషన్ లో అనూహ్యంగా ప్రభాస్ తెరపైకొచ్చాడు. బాహుబలి తర్వాత ఓ జాతీయ స్థాయి వాణిజ్య ప్రకటనలో నటించే ఛాన్స్ అందుకున్నాడు.