నిన్న లండన్ ఓవల్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు అక్కడ ఫామిలీతో సహా మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ నిన్న విపరీతంగా వైరల్ అయ్యాయి. అల్ట్రా స్టైలిష్ లుక్ లో తమ హీరోను చూసుకుని అభిమానులు మురిసిపోయారు. అసలే కీలకమైన మ్యాచ్. జైత్రయాత్రలకు మారు పేరైన ఆసీస్ తో ఆట కాబట్టి నిన్న ప్రారంభానికి ముందు క్రికెట్ లవర్స్ కొంత టెన్షన్ పడ్డారు. అయితే శిఖర్ ధావన్-కోహ్లీ-రోహిత్ ల ఊచకోతతో పాటు పాండ్యా-ధోని బ్యాటింగ్ మెరుపులు ఇండియాకు భారీ స్కోర్ ని ఇచ్చాయి.
అసాధ్యం అనిపించే 352 టార్గెట్ ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా యధాశక్తి పోరాడినప్పటికీ భారత్ బౌలింగ్ ముందు చేతులు ఎత్తేయక తప్పలేదు. ఏదైతేనేం ఓ సూపర్ విక్టరీ దేశం మొత్తాన్ని సంతోషంలో ముంచెత్తింది. క్రికెట్ ని విపరీతంగా ఇష్టపడే మహేష్ బాబు లైవ్ లో ఇలాంటి మ్యాచ్ చూసినప్పుడు కలిగే ఆనందాన్ని వేరే చెప్పాలా. అందులోనూ ఇది మాములు విజయం కాదాయే. ప్రత్యర్థులకు డేంజర్ బెల్ మ్రోగించిన ఈ ఫలితాన్ని కళ్లారా చూసినందుకు మహేష్ గౌతమ్ నమ్రతా సితారల ఆనందం గురించి చెప్పేదేముంది.
మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తన హీరోతోనే ఉండటం మరో విశేషం. ఇంకో నాలుగు రోజుల్లో న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ ని కూడా మహేష్ లైవ్ లో వీక్షిస్తారని తెలిసింది. ఈ నెలాఖరుకు సరిలేరు నీకెవ్వరు కోసం మహేష్ వెనక్కు రావాల్సి ఉంది. ఆలోగా పాకిస్థాన్ మ్యాచ్ కూడా చూసేసి రిటర్న్ వచ్చే ప్లాన్స్ వేసుకున్నట్టుగా రిపోర్ట్. మొత్తానికి ఇండియా సూపర్ విక్టరీ మహేష్ కే కాదు అభిమానులకు కూడా సూపర్ జోష్ ఇచ్చింది