మాటీవీ అవార్డులు అంటే మెగా క్యాంప్ అవార్డులు అన్న ఓ రూమరుంది. మెగా హీరోలకే అవార్డుల పంపకం ఉంటుందని అందరిలో నెగెటివ్ షేడ్ ఒకటి ఉంది. అందుకు తగ్గట్టే గతంలో మా టీవీ అవార్డు వేడుకలకు మహేష్ కి ఆహ్వానం అందినా వెళ్లలేదని చెబుతుంటారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో మాటీవీ అవార్డుల కార్యక్రమం జరగనున్న సందర్భంగా ప్రిన్స్ అభిమానుల్లో ఓ ఆసక్తికర డిబేట్ జరుగుతోంది. ఈసారి అవార్డు వేడుకల్లో మహేష్ పాల్గొంటారా? లేదా? అన్నదే ఆ డిబేట్.
అప్పట్లో బిజినెస్ మేన్ 'ఉత్తమ నటుడు' కేటగిరీకి నామినేట్ కాకపోవడంపై ప్రిన్స్ గుర్రుగా ఉన్నారని అంతా అనుకున్నారు. నా కెరీర్ లోనే అత్యుత్తమ పెర్ఫామెన్స్ ఇది. కానీ కనీసం నామినేషన్ అయినా లేదే. మరో రెండు నెలల పాటు నేను లోకల్ గా ఉండడం లేదు. అందుకే ఏ వేడుకలకు వెళ్లడం కుదరదు.. అంటూ మహేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. అయితే ఆ తర్వాత ట్విట్టర్ ని ఎవరో హ్యాక్ చేశారు. హ్యాకర్స్ అలా రాసుకొచ్చారు.. అంటూ వివాదం సద్దుమణిగేలా చేశారు. పాస్ వర్డ్ మార్చేశాం అంటూ ఆ ట్వీట్ ని డిలీట్ చేసేశారు. ఏదేమైనా మహేష్ అభిమానులు ఆ సందర్భంలో అవార్డు రాకపోవడంపై నిరాశపడ్డారన్నది వాస్తవం. ఆ ఎపిసోడ్ లో మెగా హీరో పవన్ కల్యాణ్ కే ఉత్తమ నటుడుగా పట్టంగట్టారు. గబ్బర్ సింగ్ లో నటనకుగాను ఉత్తమనటుడిగా పవన్ ని ఎంపిక చేసింది మాటీవీ అవార్డుల కమిటీ.
2014 సినిమాలకు ఇప్పుడు అవార్డులిస్తున్నారు. ఇదే ఏడాది మహేష్ నటించిన '1నేనొక్కడినే' హిట్టవ్వకపోయినా మహేష్ నటనకు గొప్ప ప్రశంసలొచ్చాయి. ఈ ఏడాది అవార్డులు ఈరోజు సాయంత్రం జరుగుతున్నాయి. 1-నేనొక్కడినే చిత్రంతో పాటే రేసుగుర్రం, లెజెండ్, దృశ్యం, లౌక్యం పోటీలో ఉన్నాయి. అంటే మాటీవీ 2015 అవార్డు వేడుకల్లో మహేష్ తో పాటే బన్ని, బాలయ్య, వెంకీ పోటీలో ఉన్నారు. వీళ్లలో ఉత్తమనటుడు అవార్డు ఎవరిని వరిస్తుంది? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇక అసలు వేడుకలో మహేష్ పాల్గొంటారా? లేదా? అన్నదే వెయ్యి మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఇప్పుడు మాటీవీ యాజమాన్యం మారింది. పరిణామం మారింది. కాబట్టి అవార్డుల్లో ఏదైనా కొత్త మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి.