అవతార్ ఫ్రాంఛైజీలా... అవెంజర్స్ సిరీస్ లా.. బ్యాట్ మేన్.. యాంట్ మేన్.. బ్లాక్ పాంథర్ లా మనకి కూడా ఒక అద్భుతమైన ఫ్రాంఛైజీ కావాలి. అలాంటి ఫ్రాంఛైజీని సృష్టించే ధైర్యం తెగువ భారతదేశంలో ఒకే ఒక్క దర్శకుడికి మాత్రమే ఉందని ప్రూవైంది. శిఖరానికి పూచిక పుల్లకు లంకె వేసి అజేయంగా ముందుకు సాగే ధీరత్వం ఎవరికి ఉంది? అంటే.. అది కచ్ఛితంగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి మాత్రమే అని చెప్పొచ్చు. బాహుబలి -బాహుబలి 2- ఆర్.ఆర్.ఆర్ తో అది నిరూపించి చూపించాడు.
ఇది తెలుగోడి ధైర్యం. తెలుగు గడ్డ పై పుట్టిన బిడ్డడి హార్డ్ వర్క్ డెడికేషన్ ఆలోచనా శక్తికి దక్కిన ఫలితం అని మనం ప్రశంసించాలి. నేడు భారతీయ సినిమా సరికొత్త పుంతలు తొక్కడానికి హాలీవుడ్ తో పోటీపడటానికి ఆద్యుడిగా రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుని మరిన్ని సాహసాలను చేసేందుకు అతడు వెనకాడడం లేదు. మునుముందు తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచే ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఆస్కార్ లు వాళ్లు ఇవ్వడం కాదు.. మన దగ్గరికి హాలీవుడ్ వాళ్లే వచ్చి ఆస్కార్ లు అందుకోవాలన్న మొండివాడు .. విలక్షణ నటుడు కమల్ హాసన్ మాట ప్రకారం.. మన వాడైన రాజమౌళి చేయాల్సినదంతా చేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్క తెలుగు వాడు గర్వించి తీరాలి. సరైన బడ్జెట్లు సానుకూలతలను అందించగలిగితే రాజమౌళి ఎలాంటి సాహసాలకు అయినా వెనకాడరు.
ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి అతడి ప్లానింగ్ అలానే ఉందని గుసగుస వినిపిస్తోంది. తాజా సమాచారం మేరకు మహేష్ బాబు - రాజమౌళి ప్రణాళికలు మైండ్ బ్లాంక్ అయ్యేలా షాకిచ్చే విధంగా మారుతున్నాయని తాజా లీక్ అందింది.
ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ అనూహ్యంగా కొన్ని కొత్త లీక్ లు అందించారు. ఆ వివరాల ప్రకారం... మహేష్ తో రాజమౌళి చిత్రానికి మరిన్ని సీక్వెల్ లు తెరకెక్కుతాయని వెల్లడించారు. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ఇది నేటి ట్రెండ్ కి అనుగుణంగా ఫ్రాంచైజీగా రూపాంతరం చెందుతుందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అయితే సీక్వెల్స్ లో కథలు మారతాయి కానీ ప్రధాన పాత్రలు మారవని స్టార్ రైటర్ విజయేంద్రుడు అన్నారు. మొదటి భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ ను ఖరారు చేసే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు.
సూపర్ స్టార్ మహేష్ గురించి మాట్లాడుతూ అతడిని ఆకాశానికెత్తేశారు. మహేష్ చాలా ఇంటెన్స్ యాక్టర్. అలాంటి హీరోతో రాజమౌళి చాలా కాలంగా ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా చేయాలని అనుకుంటున్నారని విజయేంద్రుడు ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమ ఆలోచనలకనుగుణంగా కథానుసారం మహేష్ బాబు బెస్ట్ ఛాయిస్ అని కూడా అన్నారు. అంతేకాదు.. మహేష్ బాడీ లాంగ్వేజ్ ఫిట్నెస్ విషయంలో లుక్ విషయంలో చాలా మార్పులు చూస్తారని కూడా విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
గోవా ఇఫీలో విజయేంద్రుడి లీకులు బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత ఆర్.ఆర్.ఆర్ తో మరోసారి సత్తా చాటిన SS రాజమౌళి తదుపరి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ని కొత్తగా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రపంచ దేశాలలో అరుదైన అటవీ లొకేషన్లలో ఈ సినిమాని చిత్రీకరించేందుకు కేషన్ల వేట సాగిస్తున్నారు.
కానీ ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ కి మహేష్ బాబు ఎందుకు ఉత్తమ ఎంపిక అవుతాడు? అంటే...?. ప్రభాస్ - తారక్-చరణ్ లతో సినిమాలు చేసిన దర్శకధీరుడు SS రాజమౌళి మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకున్నారు. మహేష్ నటించే ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఉండాలని అతడు భావించారు. వెంటనే తన ఆలోచనను విజయేంద్ర ప్రసాద్ తో కూడా పంచుకున్నారు. మహేష్ ఎంపిక అలా పూర్తయినా తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు కథాంశాన్ని తీర్చిదిద్దామని కూడా విజయేంద్రుడు తెలిపారు.
మహేష్ నటించిన యాక్షన్ సన్నివేశాలను చూస్తే చాలా ఎమోషనల్ గా ఉంటాడని అది ఏ రచయితకైనా చాలా అవసరమైన విషయం అని కూడా విజయేంద్ర ప్రసాద్ గతంలో అన్నారు. మహేష్ బాబు- SS రాజమౌళి తదుపరి సినిమా నుండి ఏమి ఆశించవచ్చు? అంటే...?. "ఒక రచయితకు హీరో పాత్ర నుండి ఇంటెన్స్ సంఘర్షణను తీసుకురావడానికి ఎక్కువ సమయం పట్టదు. మహేష్ ఎలాంటి సన్నివేశంలో అయినా ఏ సమయంలోనైనా సులభంగా తనను తాను మలుచుకోగలడు. ఇది ప్రతి ఒక్కరి పనిని సులభతరం చేస్తుంది" అని అన్నారు. అడవిలో సాహసవిన్యాసాలతో (ఫారెస్ట్ అడ్వెంచర్) ఒక చక్కని మూవీ ఇదని వెల్లడించారు. మహేష్ కోసమే ఈ కథను రాయడం ప్రారంభించామని తెలిపారు.
సాహసాల కథతో సావాసం:
సాహసం అనేది అనేక దేశాలకు హీరో పాత్రను తీసుకెళుతుంది.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చిత్రీకరించడానికి ఇప్పటికే టీమ్ ప్లాన్ చేస్తోందని కూడా విజయేంద్రుడు కథపై హింట్ ఇచ్చారు. షూట్ షెడ్యూల్ గురించి ప్రశ్నించగా.. "మేం వచ్చే ఏడాది మే-జూన్ నాటికి దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాం" అని సమాధానమిచ్చారు.
గోవాలో జరిగిన 53వ IFFIలో స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఫిల్మ్ మేకింగ్ ఔత్సాహిక విద్యార్థులకు మాస్టర్ క్లాస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న కథలకు చాలా మంది రచయితలు ఉన్నారు.. మేం మీ నుండి ఒక దృశ్యం (సినిమా) కోరుకుంటున్నామని నిర్మాతలు తనను కోరతారని తెలిపారు.
ఆయన బాహుబలి -బాహుబలి 2- భజరంగి భాయిజాన్- మణికర్ణిక-తలైవి లాంటి సంచలన చిత్రాలకు కథలు అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలోనే అరుదైన పాన్ ఇండియా సినిమా కథల రచయిత గా గొప్ప గౌరవాన్ని అందుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.