జ‌ర్మ‌నీలో మ‌హేష్‌- న‌మ్ర‌త డిటాక్స్ థెర‌పీ?

Update: 2022-07-12 03:52 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ 'స‌ర్కార్ వారి పాట' విడుద‌ల‌ త‌ర్వాత రాజ‌మౌళితో ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్క‌నున్న ఈ భారీ చిత్రం ప్రారంభం కావ‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ప‌ట్ట‌నుంది. అయితే ఈలోగానే మ‌హేష్ వ‌రుస విహార‌యాత్ర‌ల‌తో రిలాక్స్ అవుతున్నారు.

మహేష్ బాబు -నమ్రతా శిరోద్కర్ ఇటీవ‌లే దుబాయ్- ప్యారిస్ స‌హా ప‌లు అంద‌మైన న‌గ‌రాల‌ను సంద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అన్ని విహారయాత్ర ల నుంచి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా జర్మనీలోని బాడెన్-బాడెన్ లో యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు.

ఈ వేస‌వి వెకేష‌న్ కోసం తార‌లు విదేశాల బాట ప‌డుతున్నారు.సెలబ్రిటీలు వేస‌వి తాపానికి దూరంగా సీత‌ల ప్ర‌దేశాల్లో సరదాగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. సూప‌ర్ స్టార్ మహేష్ బాబు నైరుతి జర్మనీలోని ఒక విచిత్రమైన స్పా ఉండే పట్టణానికి వెళ్లారు. త‌న‌తో పాటే నమ్రతా శిరోద్కర్ .. వార‌సులు సితార - గౌతమ్ కూడా ఉన్నారు. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లోని బాడెన్-బాడెన్ లో వీరంతా విహ‌రిస్తున్నారు.

మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ త‌మ‌ చిన్నారులతో జర్మనీలో బ్రెన్నర్స్ పార్క్-హోటల్ & స్పా లో ఉన్నారు. ఈ రిసార్ట్ నిర్మలమైన బాడెన్-బాడెన్ పట్టణం మధ్యలో ఉంటుంది. బ్రెన్న‌ర్స్ పార్క్ స్పా టూరిస్టుల‌కు అద్భుతమైన గోప్యతను అందించే చోటు. ఎంతో ఆకర్షణీయమైన పార్క్ ల్యాండ్ తో పచ్చద‌నంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. సితార ఆ ప్రాంతంలో ఒక  క్యూట్ పిల్లిని క‌లుసుకుంది. మహేష్ స్వయంగా వారి కౌంటర్లో దానిని లాంజింగ్ ఫోటోగా పోస్ట్ చేశాడు.

అల్లీ రీట్ స్టాల్ లో గుర్రపు స్వారీ ఈసారి విహార యాత్ర‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఇక్క‌డ అంద‌మైన ప్ర‌దేశాల్లో స‌రికొత్త అనుభవాలను పొందడం .. ప్రకృతితో కనెక్ట్ కావడం అనేది ఇంట‌ర్న‌ల్ థీమ్. దీనికి గుర్రపు స్వారీ ఒక అద్భుతమైన మార్గం.. అందుకే సూపర్ స్టార్ మహేష్ -భార్య నమ్రత బాడెన్-బాడెన్ లోని అల్లీ రీట్ స్టాల్ కి వెళ్లారు. వారి పిల్లలు గౌతమ్- సితార గుర్రపు స్వారీ పాఠాలు నేర్చుకున్నారు. అలాగే నమ్రత లాయం వద్ద విశ్రాంతిగా మధ్యాహ్న స‌మ‌యాన్ని గడిపిన ఫోటోలను పోస్ట్ చేసింది.

లిచ్ టెంటలర్ అల్లీలో వేసవి షికారు లిచ్ టెంటలర్ అల్లీలో విశ్రాంతిగా ఉన్న‌ప్ప‌టి  ఫోటోల‌ను నమ్రత పోస్ట్ చేసింది. ఈ స్పా పట్టణంలో ఫేమ‌స్ కావ‌డానికి కార‌ణాలు అనేకం. ఆ ప‌రిస‌రాల్లో  చూడ‌ద‌గ్గ‌ చారిత్రాత్మక పార్కు ఆర్బోరేటమ్ ఉంది. ఇది ఊస్ నది పశ్చిమ తీరం వెంబ‌డి ఉంది. అనేక పుష్పించే పొదలు చెట్లతో అలంకరించిన‌ట్టుగా క‌నిపించే ప్ర‌దేశ‌మిది. వెర్సైల్లెస్-ప్రేరేపిత స్పీల్ బ్యాంక్ లేదా క్యాసినోను వీక్షించడానికి కుర్హౌస్ కాంప్లెక్స్ లో అవ‌కాశం ఉంది. పిల్లలతో యాత్రికులు దీన్ని మిస్ చేయాల్సి ఉంటుంది.

స్పా థెరపీలు - డిటాక్స్ డైట్ లు ఈ విహార యాత్ర‌లో అందమైన హోటల్ కం స్పా అనుభవాలను మ‌హేష్‌ కుటుంబం స‌ద్వినియోగం చేసుకుంటోంది. అసాధారణ అనుభవం కోసం నమ్రత డిటాక్స్ థెరపీలలో ఒకదాన్ని ఎంచుకున్నార‌ట‌. ప్రోగ్రాం మొదటి రోజున జంక్ ఫుడ్ ను తిన్న తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి 7-రోజుల డిటాక్స్ ఎలా ఉంటుందో న‌మ్ర‌త వెల్ల‌డించారు. వరుసగా 5 రోజులు సూప్ లు  స్మూతీస్ లు తీసుకున్న తర్వాత 7వ రోజున ఒక అప్ డేట్ ను అందించారు. ఇప్పుడు చాలా రిఫ్రెష్ గా ఉందని తెలిపారు. నిజానికి బాడెన్-బాడెన్  స్పా పట్టణం కుటుంబ సభ్యులతో కొంత  విశ్రాంతిని పొందడానికి ఉత్తమమైన ప్రదేశం.
Tags:    

Similar News