బర్త్ డే పోస్టర్: చదువుకుంటున్న మహేష్ మేనల్లుడు

Update: 2020-04-06 06:00 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందిస్తున్న ఈ ప్రేమకథా చిత్రం షూటింగ్ చాలా రోజులే క్రితమే ప్రారంభమైంది.  తాజాగా అశోక్ జన్మదినం సందర్భంగా ఫిలిం యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ తమ హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పోస్టర్ లో అశోక్ ఓ బెంచ్ పై కూర్చుని స్టడీ ల్యాంప్ వెలుతురులో ఒక పుస్తకం చదువుతూ ఉన్నాడు.  రెడ్ కలర్ టీ షర్టు.. బ్లాక్ కలర్ చిరుగుల జీన్స్.. బ్రౌన్ కలర్ జాకెట్ ధరించి మేనమామ మహేష్ బాబు స్టైల్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. స్టడీ ల్యాంప్ కింది భాగంలో గోడకు HERO అనే ఇంగ్లీష్ అక్షరాలు స్టిక్కీ నోట్స్ అంటించి ఉండడం గమనించవచ్చు. పోస్టర్ లో ఉన్న కొన్ని ఐటమ్స్ చూస్తూ ఉంటే ఈకాలం వస్తువులలాగా కనిపించడం లేదు.  మరి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఏమైనా ఈ కథకు పీరియడ్ టచ్ ఇచ్చాడేమో వేచి చూడాలి.

ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. అమర్ రాజా మీడియా & ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. మరి మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తున్న అశోక్ టాలీవుడ్ లో తన సత్తా చాటగలడా?  తాతయ్య కృష్ణ.. మేనమామ మహేష్ స్టైల్ లో పెద్ద హీరోగా ఎదగగలడా అనేది తెలియాలంటే మాత్రం కొంతకాలం వెయిట్ చెయ్యాల్సిందే.
Tags:    

Similar News