మ‌హేష్ రోజుకో బిజినెస్ ఇస్పీడేంటి?

Update: 2020-03-09 11:20 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ స్పీడ్ చూస్తుంటే అత‌డిలో ఎంట‌ర్ ప్రెన్యూర్ క్వాలిటీ జూలు విదిల్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఏషియ‌న్ నారంగ్ తో క‌లిసి ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ ని ప‌రుగులు పెట్టిస్తున్నాడు. గ‌చ్చిబౌళి ఏఎంబీ త‌ర్వాత బెంగ‌ళూరు- విశాఖ ప‌ట్నం అంటూ వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు.

దీంతో పాటే సొంతంగా వ‌స్త్ర శ్రేణి వ్యాపారం ప్రారంభించాడు. అందుకోసం ప్ర‌ముఖ‌ కార్పొరెట్ తో టైఅప్ పెట్టుకున్నాడ‌ని ప్ర‌చార‌మైంది. ప్ర‌స్తుతం ఈ వ్యాపారంలో వృద్ధి బాగానే ఉంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు సొంత‌గా ప‌లు బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తున్న మ‌హేష్ .. ఇప్పుడు ఏకంగా సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల రంగంపై దృష్టి సారించాడని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఎంబీ లోగోతో పెర్ఫ్యూమ్ బ్రాండ్ ని లాంచ్ చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇక ఇదే స్పీడ్ లో ఇంకేం బిజినెస్ లు చేయాల‌నుకుంటున్నాడో కానీ.. ఓవైపు సినిమాలతోనూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తున్న మ‌హేష్ .. త‌దుప‌రి చిత్రం విష‌యంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. వంశీ పైడిప‌ల్లితో క్యాన్సిల్ చేసుకుని ప‌ర‌శురామ్ కి ఈసారి ఓకే చెప్పాడ‌న్న ప్ర‌చారం సాగుతోంది. ప‌నిలో ప‌నిగా ప‌లువురు ద‌ర్శ‌కులు మ‌హేష్ కి క‌థ‌లు వినిపించేందుకు రెడీ అవుతున్నారు. మ‌రో ద‌శాబ్ధం ఎదురేలేని హీరోగా మ‌హేష్ కెరీర్ ని సాగించ‌నున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇదే ఊపులో ఇత‌ర బిజినెస్ ల‌ను దీపం ఉండ‌గానే చ‌క్క దిద్దుకుంటున్నాడ‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Tags:    

Similar News