ఆ ఒక్క మాట‌తో కృతి శెట్టికి మ‌హేష్ ఫ్యాన్స్ ఫిదా!

Update: 2022-09-16 06:31 GMT
కృతి శెట్టి అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఉప్పెన తర్వాత కృతి శెట్టి నటించిన 'శ్యామ్ సింగరాయ్‌', 'బంగార్రాజు' చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. దీంతో కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.  

అయితే అనతి కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి రీసెంట్ 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం' రూపంలో బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాపులు పడ్డాయి. కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న తరుణంలో ఈ ఫ్లాపులు ఆమెను ఎంతగానో నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఈ అమ్మడి ఆశలన్నీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మీదనే పెట్టుకుంది.

సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ల‌పై మహేంద్ర బాబు, కిరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. సరికొత్త పాయింట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతి శెట్టి  సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఇంట్రాక్ట్‌ అయింది. ట్విట్టర్ వేదికగా 'ఆస్క్‌ కృతి' పేరిట చిట్ చాట్ సెష‌న్ ను నిర్వహించింది. ఈ సెష‌న్ లో ఆమెకు ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్నిటికీ ఓపిగ్గా ఆమె స‌మాధానాలు ఇచ్చింది.

చిట్ చాట్ సెష‌న్ లో భాగంగా ఓ నెటిజన్ మహేష్ బాబు గురించి చెప్పమని ప్రశ్నించాడు. అందుకు కృతి శెట్టి 'రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆయన సూపర్ స్టార్' అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఒక్క మాటతో మహేష్ ఫ్యాన్స్ ఆమెకు ఫిదా అయిపోయారు. ఈ క్ర‌మంలోనే మరో నెటిజన్ కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి గురించి చెప్పమని కోరగా.. 'ఇన్స్పైరింగ్ సూపర్ స్టార్' అంటూ కృతి శెట్టి బదులిచ్చింది.

అలాగే కృతి శెట్టి కోలీవుడ్ లో సూర్య‌కు జోడీగా బాల ద‌ర్శ‌క‌త్వంలో 'వణంగన్‌' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని 'అచ‌లుడు' పేరుతో విడుద‌ల చేయ‌బోతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ తో పాటు సూర్య‌పై కృతి ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేసింది. తాను క‌లిసిన గొప్ప వ్య‌క్తుల్లో సూర్య ఒక‌ర‌ని, మరియు వ‌ణంగ‌న్ సెట్‌లో ప్రతి రోజు ఒక కలలా అనిపిస్తుంద‌ని పేర్కొంది. ఇక త‌న‌ ప్రేమ, ప్రేరణ, మద్దతు, కుటుంబం, స్నేహితులు ఇలా అన్నీ అభిమానులే అంటూ ఆమె తెలిపింది. దీంతో కృతి కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News