టాలీవుడ్ కు లీక్ సమస్య ఇప్పటిది కాదు. చిన్న సినిమాలను మొదలుకుని పెద్ద సినిమాల వరకు ఎన్నో సినిమాలు లీక్ బారిన పడ్డాయి. కొన్ని సినిమాలు ఏకంగా పూర్తిగా ఆన్ లైన్ లో లీక్ అయిన సందర్బాలు కూడా ఉన్నాయి. లీక్ అవ్వడం వల్ల సినిమాలను ముందస్తుగా విడుదల చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట నుండి మొదటి పాట విడుదల చేసేందుకు హడావుడి చేస్తున్న సమయంలో అనూహ్యంగా మొత్తం పాట కూడా ఆన్ లైన్ లో లీక్ అవ్వడం ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది.
సర్కారు వారి పాట సినిమా మొదటి పాట ను లీక్ చేసింది యూనిట్ సభ్యులే అవ్వడంతో ఇతర సినిమాల మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లీక్ చేసిన వారిపై కేసు నమోదు అయ్యింది. అయినా కూడా మహేష్ సినిమాకు జరిగిన తీరుగానే తమ సినిమాకు కూడా జరుగుతుందేమో అనే ఆందోళన ఇతర ఫిల్మ్ మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
యూనిట్ సభ్యుల్లోనే కొందరు ఇలా లీక్ కు పాల్పడి మహేష్ బాబుకు వెన్నుపోటు పొడిచారు. ఆ విషయం మర్చి పోకముందే మరో లీక్ టాలీవుడ్ లో తప్పలేదు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కారు వారి పాటకు సంబంధించిన లీక్ విషయమై చర్చ జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ పాటకు సంబంధించిన విజువల్స్ లీక్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కు సంబంధించిన చివరి పాట చిత్రీకరణ జరుపుతున్నారు. ఆ పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో యూనిట్ సభ్యులు లేదా బయటి వారో తెలియదు కాని మొబైల్ ద్వారా షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఇప్పుడు భీమ్లా నాయక్ లీక్ వీడియో కూడా వైరల్ అవుతుంది. సర్కారు వారి పాటకు సంబంధించిన హడావుడి తగ్గకుండానే ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.
ఈ స్మార్ట్ ఫోన్ ల కాలంలో షూటింగ్ జరిగేప్పుడు మాత్రమే కాకుండా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండకుంటే ఇలా లీక్ ల బారిన పడక తప్పదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ కూడా జాగ్రత్తగా ఉండాలని.. సినిమా షూటింగ్ జరిగే సమయంలో మొబైల్స్ సెట్స్ కు తీసుకు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భీమ్లా నాయక్ నుండి లీక్ అయిన వీడియోను వెంటనే డిలీట్ చేయించే ప్రయత్నాలు చేశారు. ఆ విషయంలో సోషల్ మీడియా టీమ్ యాక్టివ్ గా వ్యవహరించి వీడియోను తొలగించారు. ఇలా జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పవన్ అభిమానులు యూనిట్ సభ్యులకు సూచిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్దం అవుతున్న ఈ సమయంలో లీక్ కు సంబంధించిన విషయం కాస్త హాట్ టాపిక్ అయ్యింది. మహేష్ బాబు.. పవన్ లకు జరిగిన ఈ సంఘటనలు ముందు ముందు మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేశాయి అనుకోవచ్చు.