యాత్ర నుంచి సిండికేట్ దాకా

Update: 2019-08-01 06:45 GMT
స్వర్గీయ జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఘటాన్ని తీసుకుని యాత్ర సినిమాగా మలిచి రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు అందుకున్న దర్శకుడు మహి రాఘవ్ కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సిండికేట్ పేరుతో ఓ యాక్షన్ డ్రామాను రూపొందించబోతున్నట్టు తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇప్పటిదాకా ఈ జోనర్ ని టచ్ చేయని రాఘవకు ఇది డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ అవుతుంది.

యాత్రను తెరకెక్కించిన విధానం మమ్ముట్టి లాంటి స్టార్ హీరోను డీల్ చేసిన పద్ధతి చూసి మహికి చాలా ఆఫర్స్ వచ్చాయని ఆ టైంలోనే టాక్ వచ్చింది. కానీ తొందరపడకుండా సబ్జెక్టు మీద వర్క్ చేసిన మహి రాఘవ్ ఫైనల్ గా సిండికేట్ దగ్గర లాక్ అయ్యాడు. ఇంతకు ముందు తీసిన ఆనందో బ్రహ్మ ఇప్పటికీ డిఫరెంట్ హారర్ మూవీగా ఆదరణ పొందుతూనే ఉంది. మొదటి సినిమా పాఠశాల ఆశించిన ఫలితం అందుకోనప్పటికీ మహిలోని టెక్నీషియన్ మీద ఎప్పుడూ కంప్లైంట్ రాలేదు. ఇప్పుడీ సిండికేట్ కూడా అదే తరహాలో డిఫెరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందని దర్శకుడి మాట.

షూటింగ్ త్వరలో అన్నారు కానీ క్యాస్టింగ్ తో పాటు టీమ్ వివరాలు ఏవీ తెలియపరచలేదు. కథ మీద మాత్రం ఎక్కువ ఫోకస్ ఉంటుందని నోక్కి చెబుతున్నాడు. టైటిల్ ని బట్టి చూస్తే ఇదేదో మాఫియా హవాలా లాంటి కాన్సెప్ట్ తోనో లేక అవినీతి రాజ్యమేలే కాంట్రాక్టుల కుంభకోణం గురించో ఉన్నట్టుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తానన్న మహి రాఘవ్ ఎలాంటి  కాన్సెప్ట్ తో వస్తాడో వేచి చూడాలి

    

Tags:    

Similar News