క్యాన్స‌ర్ తో న‌టి.. ఆ స‌మ‌యంలో త‌న‌తోనే..!

Update: 2022-06-12 09:30 GMT
వెట‌ర‌న్ క‌థానాయిక మహిమా చౌదరి రొమ్ము క్యాన్సర్ తో తన ప్రయాణం గురించి వెల్ల‌డించి హెడ్ లైన్స్ లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. షారుఖ్ ఖాన్ నటించిన పర్దేస్ (ప‌ర‌దేశీ) చిత్రంతో న‌టిగా మహిమ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బాగ్బాన్- లజ్జా- దాగ్: ది ఫైర్- కురుక్షేత్ర త‌దిత‌ర‌ చిత్రాలలో నటించింది.

గత కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె అనుపమ్ ఖేర్ తో కలిసి `ది సిగ్నేచర్‌` చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. కొన్ని రోజుల క్రితం మిస్ట‌ర్ అనుప‌మ్ ఖేర్ .. క్యాన్స‌ర్ తో మ‌మిమ‌ ప్రయాణాన్ని వ్యాధితో చేసిన పోరాటం గురించి షేర్ చేయ‌గా .. మహిమాతో సెట్స్ లో ఉన్న వీడియోను పంచుకున్నారు. ఇప్పుడు కొన్ని క్షణాల క్రితం..అనుప‌మ్ మళ్లీ తన సోషల్ మీడియా స్పేస్ లోకి వెళ్లి మహిమ తో అత‌డి ఫోటోలు ఉన్న ఒక‌ వీడియోను షేర్ చేసారు. ఈ వీడియో మహిమా చౌదరి ఫోటోతో ప్రారంభమవుతుంది. టైటిల్ మహిమ & నేను - 2022 అని రాసి ఉంది.
అటుపై ఇద్దరు నటులు కలిసి ఫోటోలు దిగడం .. కూల్ సన్ గ్లాసెస్ ధరించడం తో ర‌క‌ర‌కాల  భంగిమలను ప్రద‌ర్శిస్తూ క‌నిపించారు. మ‌హిమ ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు అనుపమ్ ఖేర్ ఆమె వెనుక నిలబడి ఉండగా ఫోటోషూట్ కోసం అదే దిశలో చూడటం వంటివి కనిపిస్తాయి. మరొక క్లిప్ లో మహిమా తన విగ్ ని అమరుస్తూ క‌నిపిస్తుంది. వేరొక చిత్రంలో అనుపమ్ ఖేర్ ఆమె తలపై ముద్దు పెట్టాడు. ఈ వీడియోను పంచుకుంటూ అనుపమ్ పోస్ట్ కు క్యాప్షన్ గా ``కొన్నిసార్లు మీరు కన్నీళ్ల ద్వారా నవ్వాలి.. బాధలో చిరునవ్వుతో ఉండాలి. తద్వారా మీరు దుఃఖంలో జీవించవచ్చు!) అని వ్యాఖ్య‌ను జోడించారు. ది సిగ్నేచ‌ర్ సెట్స్ నుంచి ఈ ఫోటోలు షేర్ చేసాను అని తెలిపారు.

మహిమా చౌదరి అనుపమ్ ఖేర్ కు ధన్యవాదాలు తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో మ‌హిమ‌ రొమ్ము క్యాన్సర్ తో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది. ఇది మానసిక యుద్ధం అని.. చికిత్స నాలుగు నెలల పాటు కొనసాగిందని చెప్పారు. అనుపమ్ ఖేర్ మద్దతు ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఆ సమయంలో తన రోగ నిర్ధారణ గురించి తన తల్లిదండ్రులకు కూడా తెలియదని చెప్పింది. నిజానికి ఆమె శస్త్రచికిత్స సమయంలో త‌న‌ తల్లి అక్కడే ఉంది. కానీ అది దేనికి సంబంధించినదో ఆమెకు తెలియదు. క్లిష్ట సమయంలో తన కూతురే తన సపోర్ట్ సిస్టమ్ గా నిలిచింద‌ని తాను ధైర్యంగా ఉందని చెప్పింది. నేను నా కుమార్తె ముందు ఉండాల‌నుకోలేదు. న‌న్ను అలా చూడకూడదని నేను త‌న‌ను నా సోదరి ఇంటికి పంపించాను. కానీ నా కుమార్తె ఎప్పుడూ తిరిగి వస్తుంది. త‌ను ఎప్పుడూ నా పక్కనే ఉంది`` అని చెప్పింది.
Tags:    

Similar News