మజిలీకి డ్యామేజ్ అయ్యాక లేచిన అమెజాన్

Update: 2019-05-08 17:30 GMT
మూడు రోజుల క్రితం ఆన్ లైన్ లో అందులోనూ టొరెంట్స్ లాంటి పైరసీ సైట్స్ లో మజిలీ హై క్వాలిటీ హెచ్డి ప్రింట్ చూసి అందరూ షాక్ తిన్నారు. ఇండియాలో మే 10న విడుదల చేస్తామని అమెజాన్ ప్రైమ్ ప్రకటించిన తేదీకి ఐదు రోజుల ముందే ప్రత్యక్షం కావడం చూసి ఆశ్చర్యపోని వారు లేరు. అది యుఎస్ ప్రైమ్ లో అప్ లోడ్ చేసిందని తర్వాత తెలిసింది. అయినా ఇండియన్ మూవీస్ కి ప్రైమ్ ముందు నుంచే ఒకే డేట్ ఫార్ములా పాటిస్తోంది.

మరి అమెరికాలో మాత్రమే ఇది ఎలా అప్ లోడ్ అయ్యిందనే ప్రశ్నకు సమాధానం సదరు యాజమాన్యానికే తెలియాలి. పొరపాటుగా జరిగిందా లేక కావాలనే అక్కడ ముందుగానే అందుబాటులోకి తెచ్చారా అనే దాని గురించి క్లారిటీ రావలసి ఉంది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది. రెగ్యులర్ గా కొత్త సినిమాల కోసం టొరెంట్ మీద ఆధారపడే వాళ్లకు అద్భుతమైన క్లారిటీతో మజిలీ దొరికేయడంతో వైరల్ గా అది ల్యాప్ టాప్స్ స్మార్ట్ ఫోన్స్ లోకి చేరిపోయింది.

ఇప్పుడు అమెజాన్ ముందు చెప్పిన 10కి ఫ్రెష్ గా అప్ లోడ్ చేస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా నిలిచింది. ఏప్రిల్ నుంచి ఏ సినిమా అయినా రెండు నెలల తర్వాతే స్ట్రీమింగ్ కావాలన్న నిబంధనను పక్కన పెట్టిన అమెజాన్ తదుపరి ఏం చేయబోతోందో వేచి చూడాలి. ఫైనల్ రన్ కు రాకుండానే మజిలీకి ఇలా జరగడం చైతు ఫ్యాన్స్ ని బాగా కలవరపరిచింది. గ్యాప్ తర్వాత కొట్టిన బ్లాక్ బస్టర్ కు ఇలా జరిగితే బాధే కదా

    

Tags:    

Similar News