నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ డ్రీమ్ రన్ కంటిన్యూ అవుతోంది. అతడి లేటెస్ట్ మూవీ ‘మజ్ను’ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు ముంచెత్తుతున్నా సరే.. తొలి వారాంతంలో ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.8.5 కోట్ల షేర్.. రూ.14 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది.
నైజాం ఏరియాలో ‘మజ్ను’ రూ.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. షేర్ రూ.2.75 కోట్లు వచ్చింది. లో బజ్ ఉన్నా.. వర్షాలున్నా ఈ ఫిగర్ వచ్చిందంటే చిన్న విషయం కాదు. నాని స్టామినా ఎలా పెరుగుతోందో చెప్పడానికి ఈ లెక్కలే రుజువు. సీడెడ్లో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. అక్కడ కోటి రూపాయల గ్రాస్.. రూ.70 లక్షల షేర్ వసూలైంది. ఆంధ్రాలో కూడా కలెక్షన్లు కొంచెం తక్కువే ఉన్నాయి. అక్కడ రూ.3.75 కోట్ల గ్రాస్.. 2.6 కోట్ల షేర్ వచ్చింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.8.75 కోట్ల గ్రాస్.. రూ.6.1 కోట్ల షేర్ వసూలైంది.
ఇప్పటిదాకా వచ్చిన వసూళ్లు సంతృప్తికరమే కానీ.. బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కు రావాలంటే వీక్ డేస్ తో పాటు.. రెండో వారాంతంలో కూడా ఓ మోస్తరు వసూళ్లు రాబట్టాలి ‘మజ్ను’. ఐతే ఈ శుక్రవారం ‘హైపర్’ మంచి అంచనాల మధ్య రాబోతోంది. అలాగే ‘ఎం.ఎస్.ధోని’ కూడా రిలీజవుతోంది. తెలుగు రాష్ట్రాల బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చేయొచ్చు కానీ.. అమెరికాలో మాత్రం దెబ్బ పడేలా ఉంది. అక్కడి బయ్యర్ సినిమా మీద రూ.2.5 కోట్ల పెట్టుబడి పెట్టేశాడు. అక్కడ ఈ సినిమా 8 లక్షల డాలర్లకు పైగా వసూలు చేయాలి. ఐతే వీకెండ్లో 4 లక్షల డాలర్లు కూడా రాలేదు. కాబట్టి అక్కడ మాత్రం నష్టాలు తప్పేలా లేవు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/