అడవి శేషు లో మల్టీ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మంచి నటుడే కాదు.అంతకు మించి రైటర్. తనలో ఆ ప్రతిభనే శేషుని అంతటి వాడిని చేసింది. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కిందంటే డిఫరెంట్ అటెంప్ట్ లనే కారణాలుగా చెప్పొచ్చు. తనలో ఆ లక్షణమే సూపర్ స్టార్ మహేష్ లాంటి స్టార్ హీరోతోనే షెభాష్ అనిపించుకునేలా చేసింది. మహేష్ బ్యానర్లోనే సినిమా చేసే స్థాయికి రీచ్ అయ్యాడు.
ప్రస్తుతం జీఎంబీ ప్రొడక్షన్స్ లో 'మేజర్' చిత్రంలో అడవి శేషు నటిస్తోన్న సంగతి తెలిసిందే. మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే రషెస్ చూసిన మహేష్ శేషుని పెర్పార్మెన్స్ ని ఆకాశానికి ఉత్తేసారు. ఇప్పుడున్న యువ హీరోలలో అరుదైన నటుడు అంటూ కీర్తించారు. 'గుఢచారి'..'ఎవరు' లాంటి చిత్రాలు శేషుకి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాడు. ఆ కాన్పిడెన్స్ తోనే 'మేజర్' లో నటించే అవకాశం మహేష్ ఆ యంగ్ హీరోలకి కల్పించారు.
తాజాగా శేషు ఓ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసారు. త్వరలో ఆస్కార్ విన్నింగ్ మూవీలో నటిస్తున్నట్లు తెలిపారు. ఆస్కార్ విన్నింగ్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. దీంతో అనౌన్స్ మెంట్ పై అప్పుడే ఉత్కంఠ మొదలైంది.
శేషు రీమేక్ చేయబోయే ఆస్కార్ చిత్రమేంటి? ఏ విదేశీ చిత్రమంటూ ఆసక్తికర డిబేట్ మొదలైపోయింది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో శేషు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ క్రేజ్ నే ఉత్కంఠకు దారి తీస్తుంది. అయితే ఈ సినిమా ప్రారంభం అవవ్వడానికి సమయం పట్టే అవకాశం ఉంది. 'మేజర్' మే 27న రిలీజ్ అవుతుంది.
అనంతరం ఏడాది చివర్లో 'గుడాఛారి-2' లో నటిస్తాడు. అలాగే 'హిట్' సీక్వెల్ షూటింగ్ కూడా పూర్తి చేసాడు. ఇంకొన్ని పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని పూర్తిచేసి ఆ సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శైలేష్ కొలను ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి అగ్ర నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు.
కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల్ని నిర్మిస్తోన్న జీఏ-2 లాంటి సంస్థలు శేషుతో సినిమా నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు గతంలో ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అలాగే దిల్ రాజు.. మైత్రీ లాంటి సంస్థలు కూడా కంటెంట్ చిత్రాల్ని నిర్మించాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆ జానర్ చిత్రాలకు ప్రేక్షకుల పెద్ద పీట వేస్తోన్న సంగతి తెలిసిందే.