చిత్రపరిశ్రమ పరిస్థితి చిత్రవిచిత్రంగా ఉంది. టికెట్ పెంచినా తప్పే.. టికెట్ తగ్గించినా ముప్పే. రేట్ల విషయంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఏ సినిమాని జనం ఎందుకు తిప్పికొడుతున్నారో అర్థం గాక కొందరు పండితులు ఆలోచనలే మార్చుకుంటున్నారు.
ఇంతకుముందు టికెట్ రేటు పెంచలేదని అలిగిన నిర్మాతలే ఇప్పుడు తగ్గించకపోతే ఎలా? అంటూ చివరికి దారికొస్తున్నారు. ఇష్టానుసారం పెంచేస్తే జనం థియేటర్ల వైపునకు రారన్న నిజం కూడా పక్కాగా గ్రహించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమ అనేక సమస్యలతో సతమతమవుతున్నందున పెద్ద సినిమాలకు అయినా టిక్కెట్ల ధరలు పెంచాలని నినదించారు. ఆ మేరకు పెంచాక రిజల్ట్ అన్నిటికీ ఒకేలా ఉండదని నిరూపణ అయ్యింది. అందుకే ఎఫ్ 3 నిర్మాత దిల్ రాజు ఆలోచనను మార్చుకున్నారు. తన చిత్రానికి ఎటువంటి టికెట్ రేట్లను పెంచలేదు. ఇది మంచిని స్వాగతించే సంకేతం.
ఇప్పుడు అడివి శేష్ కూడా తన సినిమాకు ఎలాంటి ధరలు పెంచబోవడం లేదని తెలిపాడు. జూన్ 3న వస్తునన #మేజర్ సాధారణ ధరలను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది సాధారణ వ్యక్తులకు అసాధారణమైన కథ`` అంటూ శేష్ ట్విట్టర్ లో అభిమానికి బదులిచ్చారు. దీనర్థం టికెట్ పెంపుతో ముప్పు ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నామని మేజర్ నిర్మాతలు పంపిణీవర్గాలు అంగీకరిస్తున్నాయని భావించాలి. మునుముందు ఇదే రియలైజేషన్ ఇతరులలోనూ కావాలని అంతా కోరుకుంటున్నారు. ఇష్టానుసారం పెంపు కాకుండా పద్ధతి ప్రకారం న్యాయమైన పెంపునే జనం కోరుకుంటున్నారని గ్రహిస్తే చాలు.