ట్రైలర్ టాక్: ఉద్వేగభరితంగా అడివి శేష్ 'మేజర్'..!

Update: 2022-05-09 12:12 GMT
టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ''మేజర్''. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని తెలుగు హిందీ మలయాళ భాషల్లో 2022 జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో 'మేజర్' ట్రైలర్ ను ఆవిష్కరించారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్.. హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. మలయాళంలో దర్శక హీరో పృథ్వీరాజ్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశారు. చీకటి సమయంలో దేశ రక్షకుడిగా మారిన ఒక వ్యక్తి యొక్క కథను అందిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన మహేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు

'బోర్డర్ దాటి పాకిస్థాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ లోకి వెళ్లాడమేంటి?.. సందీప్ అది వాళ్ళది' అని తన సుపీరియర్ ఆఫీసర్ అంటుంటడగా.. 'అది కూడా మనదే కదా సార్' అని అడివి శేష్ చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. మేజర్ మంచి కొడుకుగా ఉండటం కంటే.. మంచి భర్తగా ఉండటం కంటే.. ఒక సైనికుడిగా దేశం కోసం పోరాడటాన్ని ఇష్టపడుతున్నారు.

సందీప్ బాల్యం నుంచి.. యుక్తవయస్సు నుంచే సైన్యంలో చేరాలనే అతని లక్ష్యం.. NSG కమాండర్ గా అందించిన సేవలు.. ముంబై టెర్రర్ అటాక్స్ లో దేశం కోసం ప్రాణాలు అర్పించే విషాద సంఘటనల వరకు సోల్జర్ జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను 'మేజర్' సినిమా స్పృశిస్తుంది. సందీప్ రోల్ లో శేష్ పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి.

మేజర్ తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్ - రేవతి అద్భుతమైన నటన కనబరచగా.. అతని ప్రేయసిగా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కనిపించింది. శోభితా ధూళిపాళ్ళ - మురళీ శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్ లో తన కుమారుడి మరణం గురించి ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ ఉద్వేగానికి గురి చేస్తున్నాయి.

అబ్బూరి రవి అందించిన సంభాషణలు.. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం.. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ 'మేజర్' ట్రైలర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. తాజాగా వచ్చిన 'మేజర్' ట్రైలర్ సందీప్ జీవితాన్ని ఆవిష్కరిస్తూ.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి.

శేష్ ఇందులో హీరోగా నటించడమే కాకుండా కథ - స్క్రీన్‌ ప్లే కూడా సమకూర్చారు. శశి కిరణ్ తిక్క ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించారు. GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల నిర్మించింది. అడివి శేష్ నటించిన ఈ మొదటి పాన్ ఇండియా చిత్రం ''మేజర్'' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.




Full View
Tags:    

Similar News