పలాస 1978 సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా 'శ్రీదేవి సోడా సెంటర్' ను ప్రకటించారు. ఈ సినిమాను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే సుధీర్ బాబు లుక్ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఖచ్చితంగా సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ సినిమా కోసం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. మొన్నటి వరకు ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించాయి. తాజాగా మరో హీరోయిన్ పేరు కూడా ఈ సినిమాకు గాను వినిపిస్తుంది. సుధీర్ బాబుకు జోడీగా నటించబోతున్న ఆ హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్ నెలకొంది.
తెలుగు అమ్మాయి అయిన ఆనంది ని ఈ సినిమా కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఈమె తమిళంలో వరుసగా సినిమాల్లో నటించి నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తెలుగులో కూడా ఈమె మంచి పాత్రల్లో నటించి మెప్పించింది. ఉత్తరాది ముద్దుగుమ్మలకు పోటీ అన్నట్లుగా ఈ అమ్మడు అందాల ఆరబోతకు సిద్దంగా ఉంటుంది. దానికి తోడు తన శ్రీదేవి సోడా సెంటర్ కు ఒక సింపుల్ లుక్ అమ్మాయి అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు ఈమెను ఎంపిక చేసే యోచనలో ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
త్వరలోనే ఈ విషయమై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాపై సుధీర్ బాబుతో పాటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి క్రేజీ మూవీలో ఆనందికి అవకాశం రావడం వల్ల ఖచ్చితంగా ఆమె టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.