దగ్గుబాటి రానా - సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''విరాటపర్వం''. వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డి.సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమాని విడుదల చేయనున్న నేపథ్యంలో ఇటీవలే 'కోలు కోలు' అనే పాటను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ''కోలు కోలమ్మా కోలో.. కోలో నా సామి.. మనసే మేలుకొని చూసే.. కలలో నిండిన వాడే కనుల ముందుర ఉంటే నూరేళ్లు నిదుర రాదులే" అంటూ సాగిన ఈ గీతం మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా 'కోలు కోలమ్మా...' పాట మేకింగ్ వీడియోని విడుదల చేశారు.
సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చిన 'కోలు కోలు' గీతానికి ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ మంచి సాహిత్యం అందించారు. సింగర్ దివ్య మాలిక - సురేష్ బొబ్బిలి కలసి ఆలపించారు. ఈ సాంగ్ పిక్చరైజేషన్ మరియు డానీ సాంచెజ్ లోపెజ్ - దివాకర్ మణి అందించిన విజువల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మేకింగ్ వీడియోలో దర్శకుడు వేణు మాట్లాడుతూ.. 'వెన్నెల ప్రేమ మానసికమైంది.. డివైన్ లవ్ లో ఉండే ఇంటెన్సిటీ ఆ అమ్మాయి ప్రేమలో ఉంటుంది. అందుకే ఫోక్ ట్యూన్ అయినప్పటికీ దీనికి గజల్స్ తరహా సాహిత్యం ఉంటే బాగుంటుందని అడగగానే చంద్రబోస్ అద్భుతంగా ఈ పాట రాసిచ్చారని.. సురేష్ బొబ్బిలి మంచి ట్యూన్ ఇచ్చారని.. సాయిపల్లవిపై చిత్రీకరణించిన ఈ పాటలో విజువల్స్ హైలైట్ అవుతాయని చెప్పుకొచ్చాడు.
చంద్రబోస్ మాట్లాడుతూ.. 'స్వచ్ఛమైన పల్లెటూరిలో పెరిగిన యువతి మనసులో ప్రేమ కలిగితే అది ఎంత గాఢంగా ఎంత సాంద్రముగా ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడమే ఈ పాట ముఖ్య ఉద్దేశ్యం. ఇటువంటి పాట రాయడానికి అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణూ ఊడుగులకు, అద్భుతమైన బాణీలు అందించిన సురేష్ బొబ్బిలికి గాత్రం అందించిన దివ్య మాలికకు కృతజ్ఞతలు'' అని అన్నారు. ఇంతమంచి స్వచ్ఛమైన మట్టి వాసన ఉన్న బాణీ రావడానికి కారణం స్క్రిప్ట్.. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకి నా కృతజ్ఞతలు అని సురేష్ బొబ్బిలి అన్నారు.
Full View