వీడియో: అందుకేగా మలైకా అంత ఫిట్టు!

Update: 2019-05-16 14:35 GMT
ఇంగ్లీష్ లో చాలామంది 'ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్' అంటూ ఉంటారు.  అందరి విషయంలో కాదు కానీ కొందరిని చూస్తే మాత్రం ఆ మాట నిజమే అనిపిస్తుంది.  అరవైకి దగ్గరలో ఉన్న నాగార్జున లాంటి స్టార్లను చూసినప్పుడు అలానే అనిపిస్తుంది. ఇక బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాను చూసినా సరే ఆమెకు వయసు ముప్పైలోనే ఆగిపోయిందా అనే అనుమానం రాకమానదు. అయితే అలా కనిపించడానికి వెనుక ఎంతో సెల్ఫ్ డిసిప్లిన్.. ఆరోగ్యకరమైన జీవనం.. రెగ్యులర్ గా ఎక్సర్ సైజులు చేయడం లాంటివి ఉంటాయి.

మలైకా విషయమే తీసుకుంటే ఆమె వయసు 45 ఏళ్ళు.  టీనేజ్ వయసులో ఉన్న కొడుకు ఉన్నాడు. కానీ ఆమె ఫిట్నెస్ మాత్రం కిరాక్ గా ఉంటుంది. యోగాలో ఎన్ని రాకాల ఆసనాలు ఉన్నాయో వాటన్నిటినీ అవలీలగా.. అతి సులభంగా చేసిపారేస్తుంది అందుకే ఒక్కోసారి మలైకా మలేషియా థాయిలాండ్  లాంటి దేశాలు వెకేషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ బ్యూటిఫుల్ లోకేషన్స్ లో యోగా చేస్తున్న అసనాలు వేస్తున్నా ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా అలాంటి దేశాలకు వెళ్ళకుండానే ముంబైలోనే ఒక కఠినమైన బార్ ఎక్సర్ సైజ్ చేస్తూఉన్న వీడియోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.

ఈ వీడియో కు "వారం మధ్యలో ప్రేరణ.. చూడండి మీరు నాచేత ఏం చేయిస్తున్నారో" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ వీడియోలో మలైకా ఏం చేసిందంటే ఒక బార్ కు వేలాడుతూ ఉల్టా పల్టాగా మారి.. చేతులతో వేలాడుతూనే ఎక్సర్ సైజ్ చేసింది. ఆ తర్వాత పూర్తిగా రివర్స్ ఒక వృత్తం పూర్తి చేసినట్టుగా నెల మీదకు ల్యాండ్ అయింది.  ఇక హైలైట్ ఏంటంటే ఈ కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఓరగా నవ్వుతూ నడవడం.  మనలాంటి సాధారణ జనాలు కనుక అది చేసే కళ్ళు బైర్లు కమ్మి సెవెన్ జెనరేషన్స్ బ్యాక్ ఉన్న తాతయ్యలు గుర్తుకొచ్చి ఉండేవారు.. ఇక ల్యాండ్ అయ్యేసమయంలో నవ్వు కూడానా? మలైకా అందుకేగా అంత ఫిట్టు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News