ఫోటో స్టొరీ: మలైకం మళ్ళీ బికినీ మైకం!

Update: 2019-06-06 05:31 GMT
మలైకా అరోరా పేరు తెలియని హిందీ సినిమా ప్రేమికులు దాదాపుగా ఉండరు.  అర్జున్ కపూర్ డేటింగ్ చేస్తున్న బ్యూటీగా మలైకా ఈమధ్య ఎక్కువ ఫేమస్ అయింది కానీ తనకు ఉండే ప్రత్యేకతలు తనకు ఉన్నాయి.  ఎం టీవీ లో వీజె గా కెరీర్ ఆరంభించిన మలైకా మొదట్లో కొన్ని యాడ్స్ లో నటించింది.  ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా మోడల్ గా నటించింది.  అయితే ఆమెకు భారీ గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం 'దిల్ సే' లోని ఛయ్య ఛయ్యా సాంగ్.  అప్పటి నుంచి ఐటమ్ భామగా ఆమె వెనక్కు తిరిగిచూసుకోలేదు. తెలుగులో కూడా మహేష్ బాబు 'అతిథి' లో 'రాత్రైనా' ఐటెం సాంగ్.. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' లో కెవ్వు కేక పాట ఆమెను తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర చేశాయి.

అయితే ఇప్పుడు మాత్రం మలైకాను అందరికీ దగ్గర చేస్తున్నది మాత్రం ఇన్స్టాగ్రామ్.  రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులకు మలైకా స్వీట్ సర్ ప్రైజులు ఇస్తూ ఉంటుంది. ఆమె ఫోటో చూసిన ప్రతిసారి "మలైకా వయసు 45 ఏళ్ళా" అని జనాలు నోరెళ్ళబెట్టడం చాలా చాలా సహజంగా జరిగే విషయం.  యోగాను ఎడాపెడా చేస్తూ ఒంట్లో ఒక మిల్లీ గ్రాము ఫ్యాట్ లేకుండా చేసుకుంటూ జాగ్రత్త పడుతూ ఉంటుంది మలైకం.  ఆమె కనుక బికినీ వేసిందంటే 20 ఏళ్ళ హీరోయిన్లు కూడా మేమెందుకు అలా లేము అని కుళ్ళుకొని చచ్చిపోవాల్సిందే.  రీసెంట్ గా మలైకా వారికి మరోసారి కుళ్ళుకొనే అవకాశం కల్పించింది.  తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది.

లైట్ గ్రీన్ కలర్ లోకనిపిస్తున్న సముద్రపు నీటిలో ఒక అందమైన జలకన్యలా నిలబడి నీళ్ళను చల్లుతూ రెండు చేతులూ పైకెత్తి ఓ కత్తిలాంటి పోజిచ్చింది. సైడ్ యాంగిల్ లో ఫోటో తీయడం తో ఆమె ఒంపుసొంపులు నెటిజనులను కితకితలుపెడుతున్నాయి.  దీనికి నెటిజనులు కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు.  ఒకరు "సూపర్ మోడల్" అన్నారు.. "వయసు నలభై.. మనసు ఇరవయ్యే" అన్నారు. మరొకరు "భాడ్ మే గయా దునియా.. తుమ్ ఖుష్ రహో" అన్నారు.  ఒకరు మాత్రం "అర్జున్ కపూర్ ఈజ్ లక్కీ" అన్నారు. వీళ్ళందరూ ఒక తీరు.. అయితే ఒక సంప్రదాయ వాది మాత్రం "నీ వయసు గుర్తు పెట్టుకొని ప్రవర్తించు.. కొంచెమైనా సిగ్గుందా" అని కడిగిపారేశాడు!
Tags:    

Similar News