ఆ కుర్ర హీరోని ఇలానే మోసం చేసింది!

Update: 2019-07-30 14:11 GMT
మ‌లైకా అరోరాఖాన్ - అర్జున్ క‌పూర్ ప్రేమాయ‌ణం ఆల్ టైమ్ హాట్ టాపిక్. ఈ జంట ప్రేమాయ‌ణం గురించి.. విదేశీ విహారంపైనా బాలీవుడ్ మీడియా నిరంత‌రం వార్తా స్ర‌వంతి గురించి తెలిసిందే. నిత్యం కెమెరా క‌ళ్లు ఈ జంట‌ను వెంటాడుతూనే ఉన్నాయి. ముంబై విమానాశ్ర‌యంలో మాటు వేసి మ‌రీ ఈ జంట సీక్రెట్స్ ను ముంబై మీడియా ఓపెన్ చేస్తోంది. బ‌ర్త్ డే లు.. వేస‌వి షికార్లు పేరుతో ఒంట‌రి దీవుల్లో విహారాల్ని మీడియా అస్స‌లు విడిచిపెట్ట‌ లేదు. అయితే ఈ జంట మీడియాను అంతే లైట్ తీస్కుంటూ త‌మ ప‌నిలో తాము బిజీగా ఉండ‌డం చూస్తున్న‌దే.

తాజాగా మ‌లైకా మ‌ద‌ర్ నివ‌శించే `జోయ్స్ పాలి కార్ప్‌`లో అదిరిపోయే డిన్న‌ర్ పార్టీ జ‌రిగింది. ఈ పార్టీలో మ‌లైకా- అర్జున్ క‌పూర్ జంట‌గా పాల్గొన‌డం మీడియాలో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆ డిన్న‌ర్ లో మ‌లైకా సోద‌రి అమృత అరోరా స‌హా ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఆ ఫోటోల్ని ప్ర‌స్తుతం అభిమానులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు.

ఈ ఫోటోల‌తో పాటే.. ఇటీవ‌లే బాంద్రాలో ఓ రెస్టారెంట్ నుంచి బ‌య‌ట అడుగు పెడుతూ మ‌లైకా ఓ గొడుగు వేసుకుని వెళుతూ మీడియా కంటికి చిక్కింది. వైట్ క్రాప్ టాప్.. డెనిమ్ జీన్స్ లో అల్ట్రా మోడ్ర‌న్ స్టైల్లో మ‌లైకా ఇచ్చిన ఫోజు అంత‌ర్జాలంలో హైలైట్ అవుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో కుర్ర‌కారు లో వైర‌ల్ గా మారింది. మ‌లైకా ఫిట్ లుక్ అబ్బుర ప‌రుస్తోంది. ముఖ్యంగా 46 వ‌య‌సులో మ‌లైకా యాబ్స్ .. పెర్ఫెక్ట్ టోన్డ్ బాడీ మైమ‌రిపిస్తోంది. ఇందుకోసం త‌ను నిరంత‌రం జిమ్ముల్లో ఎంత హార్డ్ వ‌ర్క్ చేస్తుందో తెలిసిందే. మ‌లైకా జిమ్ ప్రాక్టీస్ వీడియోలు.. ఫోటోలు ఇప్ప‌టికే యువ‌త‌రంలో వైర‌ల్ అయ్యాయి.


Tags:    

Similar News