నాలుగేళ్ల త‌ర్వాత మ‌లైకా ఐటం మెరుపులు

Update: 2022-11-13 02:30 GMT
హాట్ బ్యూటీ మలైకా అరోరా  వెండి తెర‌పై మెరుపులు మురిపించి నాలుగేళ్లు అవుతుంది. చివ‌రిగా 2018లో 'ప‌ఠాకా' చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ లో   న‌టించింది. ఆ త‌ర్వాత అమ్మ‌డికి అవ‌కాశాలే  గ‌గ‌న‌మైపోయాయి. దీనికి తోడు కోవిడ్ కూడా తోడ‌వ్వ‌డంతో వ‌య‌సు మ‌ళ్లిన బ్యూటీని  ఎంపిక చేసుకోవాలంటే ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది.

బుల్లితెర పై ప్రోగ్రామ్ లు కూడా పెద్ద‌గా చేయ‌డం లేదు. నిర్మాత‌గా మూడు సినిమాలు చేసి అక్క‌డ నుంచి ఎగ్జిట్ అయింది. మిగ‌తా భాష‌ల్లోనూ అవకాశాలు రాలేదు. ఆర‌కంగా మ‌లైకా వృతిగ‌త కెరీర్ చ‌ర‌మాంకానికి చేరుకుంది. అయితే వ్య‌క్తిగ‌తంగా సోష‌ల్ మీడియాని షేక్ చేయ‌డంలో మ‌లైకాని కొట్టే బ్యూటీ లేద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

నిత్యం హాట్ ఫోటోల‌తో సెగ‌లు పుట్టించి కుర్రాళ్ల‌లో కాక‌లు రేపుతుంది. అలాగే ప్రియుడు అర్జున్ కపూర్ తోనూ డేటింగ్ చేస్తూ లేటు వ‌య‌సులో ఘాటు ప్రియుడంటూ నెట్టింట  సంచ‌ల‌నం అవుతుంది. ఇలా వ్య‌క్తిగ‌త జీవితం మాత్రం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. అయితే కోవిడ్ కి ముందే అమ్మ‌డి ఖాతాలో ఓ ఆఫ‌ర్ ప‌డింద‌న్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఆయుష్మాన్ ఖురానా క‌థ‌నాయ‌కుడిగా 'యాన్ యాక్ష‌న్ హీరో' చిత్రం తెర‌కెక్క‌కుతోన్న సంగ‌తి తెలిసిందే. కోవిడ్ స‌మ‌యంలోనే సినిమా షూటింగ్   పూర్త‌యింది. అనిరుద్ అయ్య‌ర్  చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ప్ర‌త్యేక పాట‌లో ఏ భామ‌ని తీసుకోవాలా? అని ఆలోచిస్తున్న స‌మ‌యంలో ద‌ర్శ‌కుడి అసిస్టెంట్లు మ‌లైకా అయితే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇవ్వ‌డంతో? మ‌రో ఛాయిస్ లేకుండా ఆమెని ఎంపిక చేయ‌డం జ‌రిగిందిట‌.

కోవిడ్ పీక్స్ లోనే ఉన్న స‌మ‌యంలో ఈ పాట‌కి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసారుట‌. సినిమాలో ఈ పాట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుందంటున్నారు. నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత అమ్మ‌డు తెర‌పై క‌పించ‌డం ఇదే తొలిసారి కావ‌డంతో  అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహం క‌నిపిస్తుంది.

ఈ నాలుగేళ్లు రక ర‌కాల ఫోటోల‌తో హీటెక్కించిన మ‌లైకా తెర‌పై  కొన్ని నిమిషాల పాటు  దృశ్య మాలిక‌లో క‌నిపిస్తే ఇంకెలా ఉంటుందో ఊహ‌కే వ‌దిలేస్తున్నారు. అలాగే మ‌లైకా  డిజిట‌ల్ బాట ప‌డుతున్న‌ట్లు  తెలుస్తోం ది. ఓటీటీ వేదిక‌లో 'మూవింగ్ ఇన్ విత్ మ‌లైకా' అనే షో  చేయ‌డానికి రెడీ అవుతోంది. మ‌రి అక్క‌డైనా బిజీ అవుతుందేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News