మొత్తానికి డైవర్స్ కావాలని తేల్చేశారు

Update: 2016-11-20 07:44 GMT
మొన్నటివరకు విడివిడిగానే ఉంటున్నారు కాని.. ఏదో తమ మధ్యన వచ్చిన మనస్పర్దలను సెట్ చేసుకునే పనిలో ఉన్నారనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు అదంతా వట్టిదేనని.. ఇక వీరు కలవరని అంటున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? పదండి ఓ లుక్కేద్దాం.

చాలా కాలం క్రితం.. సల్మాన్ ఖాన్ తమ్మడు అర్బాజ్.. అలాగే మోడల్ అండ్ డ్యాన్సింగ్ స్పెషలిస్ట్ మలైకా అరోరా ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కాకపోతే ఓ సంవత్సర కాలం నుండి వీరి మధ్యన విబేధాలు ఓ రేంజుకు వచ్చేశాయి. అందుకే చాలా రోజుల నుండి విడివిడిగానే ఉంటున్నారు. అయితే ఈ మధ్యన అర్బాజ్ ఒక ప్రక్కన గోవాకు చెందిన ఎల్లో మెహరా అనే రెస్టారెంట్ ఓనర్ తో చెట్టాల్ పట్టాల్ అంటూ తిరిగుతున్న ఫోటోలు బయటకొస్తే.. మలైకా కూడా లేట్ నైట్లు అర్జున్ కపూర్ తో స్పెండ్ చేస్తూ దొరికిపోయింది. అయినాసరే ఆల్ ఈజ్ వెల్ అంటూ వీరు స్టేట్మెంట్లు ఇచ్చారు.

కట్ చేస్తే.. శనివారం ఉదయం మలైకా అండ్ అర్బాజ్ లు బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టు వద్ద తమ లాయర్లతో కలసి కనిపించారు. పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే తాను జడ్జ్ చేస్తున్న ఒక రియాల్టీ షో లో.. టైటిల్ కార్డ్స్ లో తన పేరు చివరన ఖాన్ అనే ఇంటిపేరును తీసేయించింది మలైకా. అక్కడే మ్యాటర్ దాదాపు అందరికీ అర్ధమైపోయిందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News