పెళ్లి- పిల్లలు ఎప్పుడు? మ‌లైకా ఏమ‌న్నారు?

Update: 2020-05-03 09:30 GMT
46 ఏళ్ల మ‌లైకా అరోరాతో 34 ఏళ్ల అర్జున్ క‌పూర్ ప్రేమాయ‌ణం నిరంత‌రం హాట్ టాపిక్. ఇరువురి జంట షికార్ల‌పై ఏడాది కాలంగా బోలెడ‌న్ని అప్ డేట్స్ వేడెక్కించాయి.  అట్నుంచి వ‌చ్చిన వార్త‌ల‌తో ఇటు సౌత్ లోనూ ఈ హాట్ క‌పుల్ పై బోలెడంత డిబేట్ సాగుతోంది. ఇంత‌కీ అర్జున్ - మ‌లైకా జోడీ పెళ్లెప్పుడు?  పిల్ల‌ల్ని కంటారా క‌న‌రా?  లాంటి ప్ర‌శ్న‌ల‌కు మాత్రం అట్నుంచి స‌రైన ఆన్స‌ర్ లేదు.

తాజాగా ఓ చిట్ చాట్ లో మ‌లైకాను ఇదే విష‌య‌మై ప్ర‌స్థావిస్తే... ``ఏదో ఒక స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాం. ఒక అడుగు ముందుకు వేస్తాం. అది ఎప్పుడో ఇప్పుడే చెప్ప‌లేం`` అని పేర్కొంది. ``ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో నాకు తెలుసు. ప‌రిస్థితులు అనుకూలిస్తే నిర్ణ‌యం చెబుతాం. అప్ప‌టివ‌ర‌కూ ఏదీ చెప్ప‌లేను`` అని తెలిపింది మ‌లైకా. ప్ర‌స్తుతానికి అర్జున్ కుటుంబంతో మ‌లైకా క‌లిసిపోయింది. క‌లిసి పార్టీలు డిన్న‌ర్ లు అంటూ స‌న్నిహితంగా తిరిగేస్తోంది. ఇక మ‌లైకా 17 ఏళ్ల కుమారుడు ఆర్యన్ ఖాన్ సైతం త‌న త‌ల్లి గారి నిర్ణ‌యానికి మ‌ద్ధ‌తు తెలిపాడు.

ఇక అర్జున్ క‌పూర్ ని పెళ్లి సంగ‌తి ప్ర‌స్థావిస్తే.. ప్ర‌స్తుతం వృత్తిగ‌తంగా వ్య‌క్తిగ‌తంగా చాలా హ్యాపీగా ఉన్నాన‌ని సీక్రెట్ పెళ్లి చేసుకోనని తెలిపాడు. ఒక‌వేళ పెళ్లి చేసుకుంటే అభిమానుల‌కు చెప్పిన త‌ర్వాత‌నే చేసుకుంటాన‌ని అన్నాడు. ఇక పిల్ల‌ల సంగ‌తి అంటారా?   పెళ్లి అయితే కానీ చెప్ప‌లేరు. ఆ ఘ‌డియ కోస‌మే వేచి చూస్తున్నాన‌ని మ‌లైకా చెప్ప‌క‌నే చెప్పింది. `అనుకోకుండానే నిర్ణ‌యం ఉంటుంద‌`ని మ‌లైకా సూచ‌న ప్రాయంగా వెల్ల‌డించింది. అయితే అన్నిటికీ ప‌రిస్థితులు అనుకూలించాలి. అది ఎప్ప‌టికి అనుకూలిస్తుంది? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం. సామాజిక క‌ట్టుబాట్లు అడ్డంకులు వ‌గైరా వ‌గైరా చాలా ఉంటాయి ఎక్క‌డైనా.. అన్నిటినీ బ్రేక్ చేస్తూ స‌డెన్ గా ఈ జంట ఒక‌ట‌వుతుందేమో!!


Tags:    

Similar News