జిమ్ లో కెవ్వు కేక సెల్ఫీ

Update: 2017-12-31 05:32 GMT
బాలీవుడ్ లో కొందరు హీరొయిన్లను గమనిస్తే వాళ్ళ దగ్గర వయసు వెనక్కు వెళ్ళే మెడిసిన్ ఏదైనా ఉందేమో అని అనుమానం వస్తుంది. వయసు 40 దాటడం ఆలస్యం జీవితంలో చాలా కోల్పోయాం, ఎంతో చేసేసాం అని డీలా పడిపోయి దాన్ని శరీరంలో ముడతల రూపంలో బయటపెట్టుకునే ఎందరినో మనం నిత్యం చూస్తూ ఉంటాం.  కాని తాము ఆ బ్యాచ్ కాదని ఋజువు చేసే వాళ్ళలో మలైకా అరోరా ఒకరు. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం దిల్ సే సినిమాలో షారుఖ్ ఖాన్ తో ట్రైన్ మీద చల్ చయ్య చయ్య అనే ఒకే పాటతో దేశం మొత్తం ఒక ఊపు ఊపేసిన ఈ మోడల్ కం హీరొయిన్ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇద్దరు పిల్లలు కలిగి వాళ్ళు చేతికి వచ్చాక దంపతుల మధ్య అపార్థాలు వచ్చి విడిపోయే దాకా తెచ్చుకున్నారు.

ఇప్పుడు అరోరా వయసు 44. పైన ఫోటో చూస్తే తనకు అంత ఏజ్ ఉందంటే నమ్మడం కష్టమే. జిమ్ లో కఠినమైన ఎక్స్ సర్సైజులు చేస్తూ నడుమును ఎంతో వయ్యారంగా ఒలకబోస్తూ ఒంట్లో కండరాలన్నీ ఎంత పటిష్టంగా ఉన్నాయో చూపిస్తూ ఇచ్చిన ఈ స్టిల్ చూస్తే ఎవరికైనా ఈర్ష్య పుట్టడం సహజం. తన కన్నా పదిహేనేళ్ళు చిన్నవాడైన ఒక బాలీవుడ్ అప్ కమింగ్ హీరోతో డేటింగ్ లో ఉందనే వార్తలు ఇప్పటికే బాలీవుడ్ మీడియా లో షికార్లు కొడుతున్నాయి. ఫిజిక్ ఇలా మైంటైన్ చేస్తూ ఉంటే వయసుది ఏముంది అనుకున్నాడు కాబోలు ఆ హీరో.

ఆ మధ్య తెలుగు రాష్ట్రాలను ఊపేసిన గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాటలో పవన్ తో పోటీగా స్టెప్స్ వేసినప్పుడు మలైకా 40వ పడిలో ఉంది. ఫిగర్ అంటే ఇలా ఉండాలి అని తన ఫోజుల ద్వారా చెబుతున్న మలైకా అరోరాను మిగిలిన హీరొయిన్లు కూడా ఆదర్శంగా తీసుకుంటే కెరీర్ లాంగ్ రన్ లో ఉంటుంది.
Tags:    

Similar News