ఫోటో స్టొరీ: కవర్ పేజి తాట తీసిందిగా!

Update: 2019-08-01 07:43 GMT
మలైకా అరోరా గురించి అసలేమాత్రం ఇంట్రో ఇవ్వాల్సిన పనిలేదు ఎందుకంటే..  అంత ఫేమస్ మలైకా. నలభై ఐదేళ్ళ వయసులో ఇరవై ఐదేళ్ళ ఫిట్నెస్ ను మెయింటెయిన్ చెయ్యడమే కాదు..  గత కొంతకాలంగా కుర్ర హీరో అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉండడంతో నిరంతరం మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.  అంతే కాదు హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో మంటలు పెట్టడం అనే కార్యక్రమాన్ని ఏమాత్రం ఆపడం లేదు.

తాజాగా మలైకా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటో ట్రావెల్ + లీజర్ మ్యాగజైన్ ఆగష్టు కవర్ పేజి కావడం విశేషం.  సముద్రపు ఒడ్డున బండరాళ్లపై స్టైలిష్ దుస్తులు ధరించి హాట్ దివా తరహాలో పోజిచ్చింది.  అందాలు ధారపోసేందుకు వీలైనంత వీలున్న  బ్లాక్ టాప్.. థై స్లిట్ డిజైన్ ఉన్న పఫ్ఫీ లెహెంగా.. చేతిలో ఊరికే అలా పట్టుకున్న చున్నీతో సూపర్ మోడల్ లా కనిపిస్తోంది.  నేపథ్యంలో ఉన్న సముద్రం ఈ ఫోటో అందాన్ని మరింతగా పెంచింది.

ఈ ఫోటోకు హ్యూమా ఖురేషీ లాంటి బాలీవుడ్ భామలు లైక్స్ కొట్టారు.  పోస్ట్ చేయడమే ఆలస్యం.. లైకులతో కామెంట్లతో ఇన్స్టాగ్రామ్ హోరెత్తింది.  "అమేజింగ్ బ్యూటీ" "ఫ్యాషనబుల్ అరోరా".. "వన్ అండ్ ఓన్లీ బ్యూటీ".. "నిన్నెవరూ బీట్ చేయలేరు" అంటూ కామెంట్లు పెట్టారు.
Tags:    

Similar News