మలైకా.. అదిరింది నీ డబుల్ ధమాకా

Update: 2017-01-04 11:34 GMT
బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీస్‌ లో మలైకా అరోరా పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. పెళ్లయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా హాట్ ఫిగర్ తో.. ఐటెం సాంగ్స్ తో అదరగొట్టగల అతి కొద్దిమంది సుందరాంగుల్లో మలైకా పేరు ఫస్ట్ లోనే ఉంటుంది. తను ఇంతటి ఫిట్నెస్ ని ఫిజిక్ ని మెయింటెయిన్ చేయగలగడానికి కారణంగా తన ట్రైనర్ అని చాలాసార్లే చెబుతుంది మలైకా.

తాజాగా తన ట్రైనర్ సిండీ జోర్డియాన్ తో కలిసి హాట్ పోజులు ఇచ్చింది మలైకా అరోరా. ఇద్దరూ కలిసి ఫిట్నెస్ వర్కవుట్స్ చేస్తూ అదిరిపోయే సోయగాలతో మనసులు కొల్లగొట్టేశారు. ఒకరిని మించి మరొకరు కొలతలు చూపించడంలో రెచ్చిపోయారు. ఒకేసారి డబుల్ ధమాకా అన్నట్లుగా ఇలాంటి ఫోటో చూసే అదృష్టం అభిమానులకు బాగా అరుదుగా లభిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే అందాలను ఆరబోయడంలో మలైకాను మించిపోయి సిండీ చెలరేగిపోయింది.  

'మరింత స్ట్రాంగ్ గా ఫిట్ గా ఉండేందుకు హద్దులు సరిచేసుకోవాల్సిన సమయం ఇది. థాంక్యూ సిండీ' అంటోంది మలైకా. ఇలాంటి ట్రైనర్ కనుక దొరికితే.. మేం సిక్స్ ప్యాక్ లేంటి.. ఎంత కష్టమైనా ఓర్చుకుంటామని ఫ్యాన్స్ అంటున్నారు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News