సైఫ్ కూతురితో మలైకా వర్కవుట్స్

Update: 2017-05-30 06:10 GMT
బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్స్ కూతుళ్ల హంగామా ఎక్కువగానే ఉంది. వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. ఆ తర్వాత మాత్రం ట్యాలెంట్ తోనే పాతుకుపోతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న భామలు.. ఇప్పుడు కూడా బోలెడంత మంది ఉన్నారు. వీరిలో సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ కూడా ఉంది.

స్టార్ కిడ్ గా ఇప్పటికే సారా చాలా ఫేమస్. త్వరలోనే సినీ అరంగేట్రాన్ని చేయనుంది కూడా. సైఫ్- అమృతా సింగ్ ల కూతురు అయిన ఈమె.. బాగా ట్యాలెంటెడ్ అనే టాక్ కూడా ఉంది. ప్రస్తుతం బాడీ ఫిట్నెస్ పై పూర్తి దృష్టి పెట్టిన ఈమె జిమ్ లో గంటలు గంటలు గడిపేస్తోంది. రీసెంట్ గా మలైకా అరోరాతో కలిసి జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ ఫోటోకి చిక్కింది సారా. సైఫ్ కూతురితో కలిసి ఇలా ఓ పోల్ కి వేళ్లాడుతూ భలే పోజ్ ఇచ్చింది. తాము జిమ్ లో ఎంత సరదాగా గడిపేస్తామో అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది కెవ్వు కేక బ్యూటీ.

చిన్న వైట్ టీ షర్ట్.. లైమ్ గ్రీన్ కలర్ లో ఉన్న బుజ్జి షార్ట్ లో సారా ఆలీ ఖాన్ లుక్స్ సూపర్ గా ఉన్నాయి. 24 ఏళ్ల ఈ బ్యూటీ.. స్క్రీన్ పై బోలెడు మెరుపులు మెరిపించనుందని అంచనా. మరోవైపు 41 ఏళ్ల వయసులో మలైకా అరోరా ఫిట్నెస్ చూస్తే కళ్లలో మెరుపులు రాకమానవు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News