ఇలా వ‌ర్క‌వుట్ చేశాక మెరుపులే

Update: 2015-10-21 06:39 GMT
చెలి ఛ‌య్య ఛ‌య్య ఛ‌య్యా ఛ‌య్యా .. అంటూ అపుడెపుడో దిల్‌ సే (ప్రేమ‌తో) సినిమాతో తెలుగువారికి ప‌రిచ‌య‌మైంది మ‌లైకా అరోరాఖాన్‌. ప‌రిగెత్తే రైలు టాప్ మీద అద‌ర‌గొట్టే నృత్యంతో మ‌తులు చెద‌ర‌గొట్టింది. ఆ త‌ర్వాత మున్నికి బ‌ద‌నాము హుయీ .. అంటూ మెరుపుతీగ‌లా అదిరిపోయే విన్యాసాల‌తో క‌ట్టిప‌డేసింది.

మొన్న‌టికి మొన్న ప‌వ‌న్ క‌ల్యాన్ గ‌బ్బ‌ర్‌ సింగ్‌ లో కెవ్వు కేక అంటూ కేక‌లు పెట్టించింది. యువ‌త‌రం పిచ్చెక్కి నాట్య‌మాడే సొగ‌స‌రిత‌నం ఈ అమ్మ‌డిలో ఉంది క‌నుకే ఇప్ప‌టికీ కోటానుకోట్లు పారితోషికంగా అందుకుంటూ ఎంద‌రికో ఇన్‌ స్పిరేష‌న్ అయ్యింది. ఐటెమ్ భామ‌గా, హీరోయిన్‌ గా  ఇప్ప‌టికే క్రేజు నిల‌బెట్టుకుంది అంటే ఆ వెన‌క అందాల్ని కాపాడుకోవ‌డంలోనూ అంతే శ్ర‌ద్ధ తీసుకుంటోంది కాబ‌ట్టే. ఇదిగో ఇక్క‌డ ఈ వీడియోల్ని చూస్తే ఆ సంగ‌తి మీకే అర్థ‌మ‌వుతుంది.

జిమ్మింగ్‌ - ఎక్స‌ర్‌ సైజులు క్ర‌మం త‌ప్ప‌కుండా ఎలా చేయాలో ఈ అమ్మ‌డిని చూసి మ‌నం కూడా నేర్చుకోవాలి. తీరైన దేహ‌శిరులు రావాలంటే ఎంత శ్ర‌మించాలో ఇప్పుడ‌ర్థ‌మ‌వుతుంది.. 40 ఏళ్ల వయస్సులో కూడా ఇంత హాట్‌ గా ఉందంటే... అదంతా కేవలం ఏ యోగానో అనుకునేరు.. ఇలాంటి ఒళ్లు కరిగించి పుండు చేసుకునే వర్కవుట్‌ లు చాలానే ఉన్నాయ్‌ మరి.
Tags:    

Similar News