ఫోటో స్టొరీ: మలైకం యోగాసనం..లంబకోణం

Update: 2019-07-23 16:55 GMT
ఇరవైల వయసులో ఫిట్టుగాను పర్ఫెక్ట్ షేపులోనూ ఉండడం గొప్పేమీ కాదు.. అదే నలభైల్లో మెయింటెయిన్ చెయ్యగలిగితే మాత్రం కెవ్వు కేకే.  సరిగ్గా అలాంటి అసాధ్యం ఫీట్ ను సుసాధ్యం చేసి చూపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. ఈ బ్యూటీకి ఎక్కువ ఇంట్రో కూడా అవసరం లేరు.  హిందీ లో ఛయ్య ఛయ్య.. తెలుగులో కెవ్వు కేక పాటల ఫేం అంటే చాలు.. ఎలాంటి ప్రేక్షకుడికైనా తెలిసిపోతుంది.  మలైకా సోషల్ మీడియాలో యమా యాక్టివ్. అందుకే రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.

తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు రీ పోస్ట్ అని తెలిపింది.  గతంలో కూడా ఈ ఫోటోను పోస్ట్ చేసిందేమో మరి.  సోమవారం మోటివేషన్ గురించి వివరిస్తూ "మీ ప్రయాణంలో ఇంకా మెరుగైన వ్యక్తిగా మారేందుకు ఎవరైతే మీకు మద్దతుగా నిలుస్తున్నారో వారిని గుర్తు చేసుకొని మెచ్చుకోవాలి.  మీరు ఎప్పుడూ ఒంటరిగా నడవరు. మీరు ప్రేరణ కోసం అటూ ఇటూ చూసిన సమయంలో.. మీకు ప్రేరణ.. మద్దతు.. సంతోషం అన్నీ మీ చుట్టూ ఉంటాయి.  మీలోని శక్తిని మీకు పరిచయం చేసేవారికి ఎప్పుడూ కృతజ్ఞులై ఉండండి. @రీబాక్ ఇండియా @ది దివ్యా యోగా @సర్వయోగ స్టూడియోస్" అంటూ  ఓ పెద్ద క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో మలైకా ధరించిన నేవీ బ్లూ కలర్ స్పోర్ట్స్ డ్రెస్ కూడా అదిరిపోయింది.  ఈ ఫోటోలో యోగా క్లాసులో భాగంగా తలక్రిందులుగా వేలాడుతూ కాళ్ళను లంబ కోణంలో పెట్టింది.  ఇలాంటి కఠినమైన యోగాసనాలు వేస్తూ.. కఠోరమైన సాధన చేస్తుంది కాబట్టే నలభైలలో ఇంకా పాతికేళ్ళ వయసున్న భామ తరహాలో కనిపిస్తుంది.  

ఈ ఫోటోకు కామెంట్లు అదిరిపోయాయి... "అమేజింగ్ పోజ్.. నైస్ బ్యాలెన్స్".. "యు ఆర్ ఎ టఫ్ లేడీ".. "వావ్.. అదిరిపోయింది" అంటూ కామెంట్ చేశారు.  అయితే కొందరు మాత్రం "ఈ వయసులో నీకివి అవసరమా".. "మలైకా ఆంటీ జాగ్రత్త" అంటూ సెటైర్లు వేశారు.


Tags:    

Similar News